యాప్నగరం

నల్గొండ జిల్లాలో పులి కలకలం.. ఎట్టకేలకు వలలో పడి..

Nalgonda: గురువారం ఉదయం తెల్లవారుజామున వలలో చిరుతను గుర్తించిన పలువురు రైతులు.. పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Samayam Telugu 28 May 2020, 10:24 am
నల్లగొండ జిల్లాలో ఓ చిరుతపులి కలకలం రేపింది. ఎట్టకేలకు అది వలలో చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజపేటలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దాన్ని ఉచ్చులో పడేసేందుకు అంతకుముందే అధికారులు అక్కడ వల ఉంచారు. దీంతో అంచనాలకు తగ్గట్లే పులి వలలో చిక్కుకుంది. గురువారం ఉదయం తెల్లవారుజామున వలలో చిరుతను గుర్తించిన పలువురు రైతులు.. పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. కాగా, ఈ ఏడాది జనవరి 13వ తేదీన కూడా ఇదే మండలంలోని అజలాపురం గ్రామంలో పులి వలలో చిక్కింది. రాజపేట, ఖుదాబక్ష్‌పల్లి పరిసర గ్రామాల్లో ఇటీవల పులి దాడికి పాల్పడింది. మొత్తం ఎనిమిది దాడుల్లో పలు మేకలు, ఆవు దూడలు పులికి ఆహారం అయ్యాయి. అయితే, దాడికి పాల్పడుతున్న జంతువు ఏంటనే ప్రశ్న చాలా కాలం ప్రజల్లో ఉండేది. అది హైనానా లేక పులా అని అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా పులి వలలో చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.