యాప్నగరం

ఇవాల్టితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు

ఈరోజు లక్ష వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. మరోవైపు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మరో వారం పాటు గడువు ఉందన్నారు అధికారులు.

Samayam Telugu 31 Oct 2020, 8:06 am
అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ (LRS‌) ప్రక్రియ ప్రారంభించినట్టు జీవో నెంబరు 131ని విడుదల చేసింది. ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (ఎల్ఆర్ఎస్‌) ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్‌ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అక్రమ, అనధికార లేఅవుట్లు, పాట్ల క్రమబద్ధీకరణను తప్పనిసరిచేస్తూ ఆగస్టు 31న రాష్ట్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో రాష్ట్రవాప్తంగా ఎల్ఆర్ఎస్‌కు భారీ స్పందన వచ్చింది.
Samayam Telugu ముగియనున్న ఎల్ఆర్ఎస్ గడువు
lrs last date


కొద్ది రోజుల క్రితం అక్రమ లే అవుట్‌లోని ప్లాట్ల అక్రమ నిర్మాణాలకు సర్కార్‌ రిజిస్ట్రేషన్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం సౌకర్యం కల్పించడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట లభించినట్లెయింది. 26 ఆగస్టు 2020లోపు చేసిన లే అవుట్‌ ఓనర్లకు, రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్లాట్‌ ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నది. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి మున్సిపల్‌శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. టీఎస్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించనుంది.

Read More: తమ్ముడి కోసం ఊయల కట్టాడు... అదే అన్న ప్రాణం తీసింది

నిన్నటివరకు 24,14,337 లక్షల దరఖాస్తులు వచ్చాయి. నిన్న ఒక్కరోజే 70 వేలకుపైగా మంది ఎల్ఆర్ఎస్‌కోసం అప్లయ్ చేసుకున్నారు. ఈనెల 15న దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే రాష్ట్రంలో వర్షాలు, పలు కారణాల దృష్ట్యా మరో 15 రోజులపాటు దరఖాస్తు గడువు పొండిగించింది. ఇప్పటివరకు గ్రామపంచాయతీల్లో 10,17,293 దరఖాస్తులు రాగా, మున్సిపాలిటీల్లో 10,02,325, కార్పొరేషన్లలో 3,94,719 దరఖాస్తులు వచ్చాయి. ఈరోజు లక్ష వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. మరోవైపు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మరో వారం పాటు గడువు ఉంది.

రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరి చేయడం, గ్రామ పంచాయతీల్లోనూ ఈ పథకాన్ని వర్తింపజేస్తుండటంతో సర్కారుకు రూ. 10 వేల కోట్ల రాబడి రానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌లో క్రమబద్ధీకరణ రుసుం పెంపు, ప్రస్తుత మార్కెట్‌ విలువనే పరిగణనలోకి తీసుకుంటుండటం, ప్రతి అనధికార ప్లాటు దాదాపుగా ఎల్‌ఆర్‌ఎస్‌కు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరనుంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.