యాప్నగరం

హైదరాబాద్‌లో పురాతన భవనాలకు నోటీసులు

ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు ఇళ్ల గోడలు వర్షాలకు తడిసి కూలిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు పాత ఇళ్లలో నివసిస్తున్న వారిని వెంటనే ఖాళీ చేసి వెళ్లాలన్నారు.

Samayam Telugu 20 Aug 2020, 8:09 am
తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే పలు వరద బాధిత ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే హైదరాబాద్‌లో కూడా పురాతన భవనాలకు ముప్పు పొంచి ఉన్నందున అక్కడ నివసిస్తున్న వారిని సైతం అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నగరంలోని పాత భవనాల్ని పరిశీలిస్తున్నారు.
Samayam Telugu హైదరాబాద్
hyderabad


ముషీరాబాద్‌ నియోజకవర్గంలో పలు పురాతన ఇళ్ల గోడలు కూలిపోయాయి. బాగ్‌లింగంపల్లిలో ప్రమాదకరంగా ఉన్న అపార్ట్‌మెంట్లను ముషీరాబాద్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ పావని, సెక్షన్‌ ఆఫీసర్‌ రాందాస్‌, సిబ్బంది జగన్‌, అనిల్‌, రాజయ్య, రాంనగర్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివా్‌సరెడ్డితోపాటు పలువురు నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ పావని మాట్లాడుతూ నియోజకవర్గంలోని రాంనగర్‌, అడిక్‌మెట్‌, ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌, కవాడిగూడ, గాంధీనగర్‌ డివిజన్లలో శిథిలావస్థలో ఉన్న 25 ఇళ్ల యజమానులు వీటిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు.

వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల కవాడిగూడలో రెండు పురాతన ఇళ్లు, రాంనగర్‌ నుంచి వీఎస్టీ వెళ్లే మెయిన్‌ రోడ్‌లో ఓ కంపెనీ ప్రహరీ కూలిపోయిందని తెలిపారు. గతంలో భాగ్యనగరంలో పాత భవనాలు కూలి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో అధికారులు అప్రమత్తమై పురతాన ఇళ్లకు, పాత భవనాలకు నోటీసులు జారీ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.