యాప్నగరం

అందుకే నా భార్యను బరిలోకి దింపుతున్నా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Nalgonda ఎంపీ, టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, హుజూర్ నగర్‌ పోలీసుల తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించి అక్రమంగా కేసులు పెట్టించి టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు.

Samayam Telugu 16 Sep 2019, 5:18 pm
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ఆటకట్టించేందుకే హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో తన భార్య పద్మావతి బరిలోకి దింపుతున్నానని నల్లగొండ ఎంపీ, టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హుజూర్ నగర్ మండలంలోని గుండ్లపల్లిలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను బెదిరించి, కేసులు పెట్టి టీ‌ఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
Samayam Telugu Uttam Kumar Reddy


అధికారపార్టీ అరాచకాలపై త్వరలోనే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఉత్తమ్ చెప్పారు. ఓ మంత్రి తన స్థాయి ని మరచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం, పోలీసులతో కొట్టించడం, బెదిరించడం ద్వారా టీఆర్ఎస్‌లో చేర్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ తతంగాన్నంతా జిల్లా ఎస్పీ చూస్తూ ఉరుకుంటున్నారని ఆరోపించారు.

Read Also: ‘తెలంగాణ చంద్రయాన్.. పదేళ్లకు ఈయనే 'నట'.. కేసీఆర్‌పై విజయశాంతి సెటైర్లు

ఎవరు ఎన్ని కేసులు పెట్టి, భయపెట్టినా కార్యకర్తలు భయపడాల్సిన పని లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాను ఆర్మీలో పనిచేసిన విషయం అందరికీ తెలిసిందేనని, కార్యకర్తలపై నిర్బంధం ఇలాగే కొనసాగితే ఊరుకొనని హెచ్చరించారు. అధికార పార్టీ నాయకులు ఆగడాలను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు.

నల్లగొండ జిల్లాలో పోలీసులు తీరుపై విరుచుకపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లో నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ అధికార పార్టీ ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆరోపించారు. హుజూర్ నగర్ సి.ఐ., మఠంపల్లి ఎస్.ఐ.లపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: Telangana వాహనదారులకు భారీ ఊరట.. నూతన చట్టం అమలు చేయబోమన్న కేసీఆర్

గుండ్లపల్లి గ్రామాన్ని తనే ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ది చేశానని ఉత్తమ్ తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు కింద అనేక గ్రామాలు ముంపునకు గురైయ్యాయని, కోట్లాది రూపాయలతో పునరావాస కేంద్రాలను అన్ని హంగులతో నిర్మించానని చెప్పారు.

రూ. వేల కోట్లతో నియోజకవర్గంలో అనేక శాశ్వతమైన అభివృద్ది పనులు చేపట్టానన్నారు. రూ. వందల కోట్లతో నియోజకవర్గంలో అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మాణానికి పూనుకున్నామని తెలిపారు. గుండ్లపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి వేలాది ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చిన ఘనత తనదేనన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.