యాప్నగరం

ఒకరు సారా.. మరొకరు సోడా.. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోమారు కేసీఆర్ సర్కార్‌పై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పంగనామాలు పెడుతున్నాయని విమర్శించారు. వరి కొనకపోతే ఉరేనంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.

Samayam Telugu 27 Nov 2021, 8:53 pm
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ రెండు రోజుల వరి దీక్ష చేపట్టింది. దీక్షలో రేవంత్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కి, ప్రధానికి తేడా లేదని ఆయన అన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ ఒకరు సారా.. మరొకరు సోడా అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో వేలాది మంది రైతులు చనిపోతున్నారని.. వారికి రైతు బీమా కూడా అమలు చేయడం లేదంటూ దుయ్యబట్టారు.
Samayam Telugu రేవంత్ రెడ్డి
revanth


లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న కేసీఆర్ రైతులు పండించిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీశారు. రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది.. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సీఐ విధానాన్ని తెచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. వరి కొనుగోలు చేసేవరకూ కొట్లాడతామని.. కొనుగోలు చేయకపోతే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌కి ఉరి వేయడం ఖాయమని రేవంత్ హెచ్చరించారు. కేంద్రం 60 లక్షల టన్నలు ధాన్యం కొనుగోలు చేస్తామని చెబితే రాష్ట్రం ఇప్పటివరకూ కేవలం 8 లక్షల టన్నులు కొనుగోలు చేసిందని రేవంత్ చెప్పారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.