యాప్నగరం

నన్ను అన్ని మాటలంటే.. ఏం మాట్లాడరా? పార్టీ నేతలపై ఉత్తమ్ అసంతృప్తి!

Telangana Congress: ఇటీవల తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. వీటిపై తాను విమర్శిస్తూ మాట్లాడితే టీఆర్ఎస్ తిప్పికొట్టిందని ఉత్తమ్ అన్నారు.

Samayam Telugu 26 Dec 2019, 3:57 pm
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. గురువారం జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. వీటిపై తాను విమర్శిస్తూ మాట్లాడితే, టీఆర్ఎస్ ఆ వ్యాఖ్యలను తిప్పి కొట్టిందని, ఇంత జరిగినా ఒక్క కాంగ్రెస్ నేత కూడా అందుకు దీటుగా స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్‌ను విమర్శిస్తే ఎదురుదాడి ఎందుకు చేయలేదని అసహనం వ్యక్తం వ్యక్తం చేశారు.
Samayam Telugu uttam.


Also Read: బీజేపీ దేశాన్ని పాకిస్థాన్‌లా చేయాలని చూస్తోంది.. NRC అందరి సమస్య..

అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనంపై సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. పీసీసీ చీఫ్‌ను టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తే, ఎవరో ఒకరు స్పందించి ఉండాల్సిందని షబ్బీర్ అభిప్రాయపడ్డారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం సరికాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతలతో అన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీపై పట్టు ఉండేదని, పార్లమెంటు సభ్యుడిగా గెలిచాక కొంత పట్టు సడలిందని ఉత్తమ్ అన్నట్లు కొందరు నేతలు చెప్పారు.

Also Read: రైతు బజారుల్లో ఈజిప్టు ఉల్లి.. రూ.40, రెండు కిలోలు...

ఆ సభతో డ్రామాలాడుతున్నారు..
‘గాంధీ కావాలా? గాడ్సే కావాలా?’ పేరుతో నిజామాబాద్‌లో కేసీఆర్ నిర్వహించాలనుకుంటున్న సభ బూటకమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ సభ టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఆడుతున్న డ్రామా అని కొట్టి పారేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఏఏకు వ్యతిరేకంగా మొదటి నుంచి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతోందని, ఆ చట్టాన్ని వ్యతిరేకించేవారు ఎవరైనా తమ ఆందోళనలో పాల్గొనాలని భట్టి పిలుపునిచ్చారు. చట్టాన్ని నిజంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్.. ఈ నెల 28న తమ సభకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Also Read: కనువిందు చేసిన సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో ఇలా.. ఫోటోలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.