యాప్నగరం

'పెండ పిసికే అలవాటుతోని అలా మాట్లాడుతున్నడు'.. తలసానికి రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

TPCC Revanth Reddy: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనపై చేసిన కామెంట్లకు టీపీసీసీ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెండ పిసికే అలవాటుతో మంత్రి తలసాని అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాల్సింది పోయి ఇలా మాట్లాడటం గౌరవం అనిపించుకోదని హితవు పలికారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 10 May 2023, 2:45 pm

ప్రధానాంశాలు:

  • పెండ పిసికే అలవాటుతో అలా మాట్లాడుతున్నారు
  • ఎక్కడికి రావాలో చెబితే అక్కడకు వస్తా
  • తలసానికి రేవంత్ కౌంటర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Revanth VS Talasani: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. నిన్న (మే 9న) ఓ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. 'పొట్టోడు గింతంత ఉంటడు.. పిస్కితే పాణం పోతది' అంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈనెల 8న సరూర్‌నగర్ స్డేడియంలో కాంగ్రెస్ నిర్వహించిన యువ సంఘర్షణ సభపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఆ సభకు విచ్చేసిన కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రాపై కూడా తలసాని నిప్పులు చెరిగారు.
తలసాని కామెంట్లపై విపక్ష నేతల నుంచి కౌంటర్ ఎటాక్ మెుదలైంది. బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు నేతలు ఇప్పటికే తలసాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా.. టీపీసీసీ రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. ప్రజాప్రతినిధులుగా మనం యువతకు ఆదర్శంగా ఉండాలన్నారు. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని... స్థాయి, హోదాను దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.

" ఆయనకు చిన్నప్పటి నుంచి పెండ పిసికే అలవాటు ఉంది. దున్నపోతులను కాసిండు కాబట్టి.. చాలా కాలం దున్నపోతులతో తిరిగి.. ఆయన కూడా తనకు తాను దున్నపోతు అనుకుంటుండేమో. పెండ పిసికే అలవాటుతో ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతుండు. పిసుకుడు సంగతి దేవుడెరుగు ఆ నమిలే పాన్ పరాక్ మానేస్తే బాగుంటది. ప్రజా ప్రతినిధులగా మనం యువకులకు ఆదర్శంగా ఉండాలి. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్ పరాక్ నమిలేటోళ్లు కూడా నా గురించి మాట్లాడుతున్నరు. అది అంత గౌరవంగా ఉండదు.

ఒక వేళ ఆయనకు అంత కోరిక ఉంటే ఎక్కడికి రావాలో టైం, తేదీ చెబితే అక్కడకు వస్తా. ఎవరెం పిసుకుతరో చూస్తా. రేవంత్‌ను పిసకడం అంటే కేసీఆర్ కాళ్లు పిసకటం అనుకుంటుండేమో. ఆయన మంత్రిగా మెుదట తన బాధ్యతను గుర్తెరగాలి. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. నేనొక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఆయన జీవిత కాలం కేసీఆర్ చెప్పులు మోసినా ఈ స్థాయికి రాలేడు. కాబట్టి ఆయన స్థాయి, హోదా, భాష అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది." అని రేవంత్ కౌంటర్ ఇచ్చారు.

ఇక మంత్రి తలసాని చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక వాత్రాపై అనుచిత వ్యాఖ్యలు చేయటం.. తలసాని అహంకారానికి నిదర్శనంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 60 ఏళ్ల చిరకాల కోరికను తీర్చిన సోనియా గాంధీ.. కూతురు ప్రియాంక వాద్రా రాష్ట్రానికి వస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేసి అగౌరవపర్చటమేంటని ప్రశ్నించారు. నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయటం వారి చేతగాని తనానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.