యాప్నగరం

మంత్రి మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. బర్తరఫ్‌కు డిమాండ్

Minister Malla Reddy పై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఎన్నికల కమిషన్ ఈ పరిణామాన్ని సుమోటోగా స్వీకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇలాంటి నాయకుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 21 Jan 2020, 1:06 pm
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని, ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారని టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్ మోహన్ రెడ్డి మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఈ పరిణామాన్ని సుమోటోగా స్వీకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక, ప్రభుత్వం ఇలాంటి నాయకుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రూ.కోట్లు పలికిన టీఆర్ఓస్ బీ ఫామ్‌ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
Samayam Telugu Mallareddy police complint.


Also Read: మరింత శక్తిమంతంగా ‘సామజవరగమనా..’: కేటీఆర్ కామెంట్‌

సొంత పార్టీ నేతలే మీడియా ముఖంగా అవినీతి జరిగిందని ఆధారాలతో బయట పెడుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అవినీతికి పాల్పడితే ఉద్వాసన తప్పదని నూతన మున్సిపల్ చట్టంలో ఉందని ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్, దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. టికెట్లు కొనుక్కున్న అభ్యర్థులపై సైతం ఎన్నికల కమిషన్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Also Read: ‘ఆయన కేసీఆర్ ఇంట్లో కుక్క’ మంత్రిపై డీఎస్ సంచలన వ్యాఖ్యలు

మంత్రి మల్లారెడ్డి టికెట్ల కేటాయింపు వ్యవహారంపై ఇతర అభ్యర్థులతో మాట్లాడిన ఆడియోలు వెలుగులోకి కావడంతో క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల కోసం తమను డబ్బులు అడిగారని టీఆర్ఎస్ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ప్రజల బలహీనతలే పెట్టుబడిగా చేసుకొని డబ్బు, మద్యం , ప్రలోభాలతో టీఆర్ఎస్ ప్రతిసారి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థగా మార్చిన టీఆర్ఎస్‌ను ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.

Also Read: ఆకాశం నుంచి భూమికి భారీ బెలూన్లు.. జాగ్రత్త! ముట్టుకుంటే అంతే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.