యాప్నగరం

పాక్ నుంచి వచ్చినా ఇక్కడ ఉండొచ్చు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Serilingampally: కొందరు బీజేపీ నేతలు మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకొని మరీ, అక్కడ సీఏఏ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు మాటలతో జనం మధ్యకు వచ్చే ఇలాంటి బీజేపీ నాయకులపై తిరగబడాలని పిలుపునిచ్చారు.

Samayam Telugu 27 Feb 2020, 3:53 pm
సీఏఏపై టీఆర్ఎస్ ఎమ్మె్ల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలోనే కాదు, పాకిస్థాన్ నుంచి వచ్చినా సరే ఇక్కడి నుంచి పంపించే వారెవరూ లేరని వ్యాఖ్యానించారు. ఒకవేళ అలా పంపాల్సి వస్తే నేను కూడా మీతో వస్తానని అన్నారు. శేరిలింగంపల్లిలో గురువారం మైనార్టీ సంఘాల వారు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu 39138633_445208395985099_1437836226135588864_o


Also Read: మాజీ ఎంపీ కవితపై కేసు.. నాంపల్లి కోర్టులో విచారణ.. కేసు వాయిదా

కొందరు బీజేపీ నేతలు మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకొని మరీ, అక్కడ సీఏఏ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు మాటలతో జనం మధ్యకు వచ్చే ఇలాంటి బీజేపీ నాయకులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. అవసరం ఐతే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో సీఏఏ అమలు కాదని అరికెపూడి గాంధీ చెప్పారు.

Also Read: రేవంత్ రెడ్డి మెడకు మరో ఉచ్చు? ఈసారి ఆ దారిలో..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.