యాప్నగరం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన వారికి వనమిత్ర అవార్డులు

Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డ్స్. ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ రూపొందించిన అవార్డ్స్‌ను రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.

Samayam Telugu 5 Sep 2019, 11:53 pm
రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డ్స్ ఇవ్వాలని ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా రూపొందించిన అవార్డ్స్‌ను రాజ్యసభ ఎంపీ, సంస్థ ప్యాట్రన్ సంతోష్ కుమార్ గురువారం (సెప్టెంబర్ 5) ఆవిష్కరించారు.
Samayam Telugu vanmithra


మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ బహుమతులకు రూపకల్పన చేశారు. సంస్థ ఫౌండర్ కరుణాకర్ రెడ్డి, కో ఫౌండర్ రాఘవను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. మొక్కలు నాటిన వారందరికీ వనమిత్ర అవార్డులను త్వరలో అందజేస్తామని సంస్థ కో ఫౌండర్ రాఘవ తెలిపారు. ఇప్పటివరకు కోటి 13 లక్షల మంది భాగస్వామ్యంతో రెండు కోట్ల 83 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.