యాప్నగరం

టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే.. కవితకు దక్కని చోటు.. కారణమిదే!

TRS Party: ఈ జాబితాలో సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు లేకపోవడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి కల్వకుంట్ల కవిత బయటికన్నా ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

Samayam Telugu 20 Nov 2020, 7:24 pm
గ్రేటర్ ఎన్నికలకు నగారా మోగిన వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నాయి. స్టార్ క్యాంపెయినర్లతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. బీజేపీ ఇటీవలే స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించగా.. తాజాగా అధికార టీఆర్‌‌ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా‌ను ప్రకటించింది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌తోపాటు మంత్రులు హరీశ్ రావు, హోం మంత్రి మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్‌‌, సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్‌‌ను స్టార్ క్యాంపెయినర్లుగా టీఆర్ఎస్ ప్రకటించింది.
Samayam Telugu కవిత
kalvakuntla Kavitha


అయితే, ఈ జాబితాలో సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు లేకపోవడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి కల్వకుంట్ల కవిత బయటికన్నా ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. టీఆర్ఎస్‌లో ముఖ్య నాయకురాలైన కవిత పేరు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గ్రేటర్‌లో పలువురు టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు.

అయితే, స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అందరూ మంత్రులేనని, అందుకే కవితకు చోటు కల్పించలేదని అంటున్నారు. మహిళా మంత్రులు ఇద్దరు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.