యాప్నగరం

రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలుకు రంగం సిద్ధం... కలెక్టర్లకు ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకం అమలుకు సర్కార్ సిద్ధమవుతోంది. కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పైలట్ పద్ధతిలో పూర్తి స్థాయిలో పథకం అమలవుతోంది. మరో నాలుగు మండలాల్లోనూ పథకాన్ని అమలు చేస్తున్నారు.

Samayam Telugu 22 Jan 2022, 5:06 pm
దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ‘దళితబంధు’. హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ప్రభుత్వం... తాజాగా రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దళితబంధు అమలుపై కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
Samayam Telugu కేసీఆర్


దళితబంధు అమలుపై శనివారం సీఎస్‌ సోమేశ్ కుమార్, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల సలహాలతో 100 మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయనున్నట్టు వెల్లడించారు. వీరికి బ్యాంకు లింక్‌తో సంబంధం లేకుండా రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్‌ను ఎంపిక చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధుకు రూ.1200 కోట్లు కేటాయించామని, అందులో ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే వాసాలమర్రి, హుజురాబాద్‌లో దళితబంధు అమలు అవుతోంది. శుక్రవారం కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ యూనిట్ల వారీగా లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.