యాప్నగరం

GHMC ఎన్నికలపై పిటిషన్.. హైకోర్టులో విచారణ

బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ హైకోర్టులో ఎన్నికలపై పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లను రోటేషన్ చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.

Samayam Telugu 16 Nov 2020, 12:49 pm
జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. దాఖలైన పిల్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. రెగ్యులర్ రొటేషన్ చేసేంత వరకు గ్రేటర్ ఎన్నికలు నిర్వహించొద్దని పిల్ లో పేర్కొన్నారు. బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ పీల్ దాఖలు చేశాడు. పాత రీజర్వేషన్ పద్ధతి లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని .. రీజర్వేషన్ల ను రొటేషన్ చేసి ఎన్నికలు నిర్వహించాలని పిటీషనర్ పిల్ లో పేర్కొన్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ధాఖలైన పిటీషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
Samayam Telugu తెలంగాణ హైకోర్టు
ts high court


Read More: వీడియో: యువకుల్నిఎవరూ వినలేనన్ని బండ బూతులు తిట్టిన పోలీస్

రీజర్వేషన్ రొటేషన్ పద్దతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్ట వీరుద్దమని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ghmc యాక్ట్ సెక్షన్ 52e రీజర్వేషన్ పాలసీ కి విరుద్ధంగా ఉందని రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. త్వరలో ghmc షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అప్పటి వరకు స్టే ఇవ్వాలని రచనా రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టీస్ విచారిస్తారని తెలిపారు న్యాయవాది అభిషేక్ రెడ్డి. ఈ పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ కు న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి బదిలీ చేశారు. రేపు పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.