యాప్నగరం

వాళ్ల పోస్టు మార్టం వీడియో తీయండి.. సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court: చర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోలు చనిపోయిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతంలోని గుట్టల వద్ద ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 24 Sep 2020, 5:00 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఎన్‌కౌంటర్‌ ఘటనపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. చనిపోయిన ముగ్గురు మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ఇప్పటికే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. అయితే, కుటుంబ సభ్యుల నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకొని, కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఫ్రీజ్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఎంజీఎం ఫోరెన్సిక్ నిపుణులతో రీ పోస్టుమార్టం చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది. పోస్టుమార్టం మొత్తం వీడియోగ్రఫీ చేయించి.. నివేదికను షీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 5కు వాయిదా పడింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
telangana high court


ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలంటూ పౌర హక్కుల సంఘం ఈ లంచ్ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. మూడు మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని పిటిషనర్ కోరారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 కేసు నమోదు చేయాలని కోరారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం, ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని వాటికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

చర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోలు చనిపోయిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతంలోని గుట్టల వద్ద ఈ ఘటన జరిగింది. అనంతరం సంఘటనా స్థలం వద్ద తనిఖీ చేయగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. చనిపోయినవారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.