యాప్నగరం

రేపటి నుంచే తెలంగాణలో ఆర్టీసీ బస్సుల పరుగు: కేసీఆర్

telangana lockdown news: ఆర్టీసీ బస్సులను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నడిపిస్తారని చెప్పారు. సోమవారం కేబినేట్ భేటీ ముగిశాక, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Samayam Telugu 18 May 2020, 11:04 pm
ఆర్టీసీ బస్సులు మంగళవారం ఉదయం నుంచి బస్సులను నడిపించనున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులు ఈ సడలింపు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే, నగరంలో క్యాబ్‌లు, ఆటోలకు అనుమతి ఇస్తున్నామని వెల్లడించారు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఇవేవీ వర్తించబోవని చెప్పారు. ఆర్టీసీ బస్సులను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నడిపిస్తారని చెప్పారు. సోమవారం కేబినేట్ భేటీ ముగిశాక, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Samayam Telugu kcr


ఆర్టీసీకి అనుమతించిన క్రమంలో రోజూ బస్సులను శానిటైజ్ చేయడం సహా, ప్రయాణికులు, సిబ్బందికి మాస్కులు ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆర్టీసీకి అనుమతించిన క్రమంలో రోజూ బస్సులను శానిటైజ్ చేయడం సహా, ప్రయాణికులు, సిబ్బందికి మాస్కులు ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సులు హైదరాబాద్‌కు వస్తాయని చెప్పారు. కేవలం జూబ్లీ బస్ స్టేషన్‌కు అనుమతిస్తున్నామని, ఎంజీబీఎస్‌కు బస్సులు అనుమతించబోమని చెప్పారు. కరోనా ఎక్కువగా ఉండే కంటైన్మెంట్ ప్రాంతాలకు ఇవేమీ వర్తించబోవని కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read: undefined

అనుమతి ఉండనివి ఇవే..
లాక్‌ డౌన్ పూర్తయ్యే వరకూ మాల్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, సినిమా హాళ్లు బంద్‌ ఉంటాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. సభలు, ర్యాలీలు, సమావేశాలకు కూడా అనుమతి ఉండబోదని ప్రకటించారు. వీటితో పాటు విద్యాసంస్థలు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, జిమ్‌లు, స్టేడియాలు, పార్కులు అన్నీ బంద్‌ ఉంటాయని వివరించారు. బయటికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్‌ ధరించకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని గుర్తు చేశారు.

దుకాణాలు తెరిచే యజమానులు శానిటైజేషన్‌ చేయించాలని తెలిపారు. ఇక అనవసరంగా ప్రజలు రోడ్లపైకి రావొద్దని కోరారు. కరోనా మళ్లీ తిరగబడితే తిరిగి లాక్‌ డౌన్‌ విధించాల్సి వస్తుందని చెప్పారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.