యాప్నగరం

TSRTC: దసరాకు మూడువేల ప్రత్యేక బస్సులు.. అడ్వాన్స్ బుకింగ్ కూడా

రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 22 నుంచి 24వరకు ప్రత్యేకంగా సర్వీసుల్ని నడపనున్నారు. ప్రయాణికుల కోసం అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పించారు.

Samayam Telugu 20 Oct 2020, 8:42 am
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. జంట నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రజలకోసం ఆర్టీసీ 3000 బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తోంది. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు పెంచి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తామని టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ ఆర్‌ఎం వరప్రసాద్‌ వెల్లడించారు.
Samayam Telugu దసరాకు ప్రత్యేక బస్సులు
tsrtc dasara special


అయితే బస్సుల రూట్లలో కూడా స్వల్పంగా మార్పులు చేశారు. నిజామాబాద్, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల వైపు వెళ్లే షెడ్యూల్‌, స్పెషల్‌ బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్‌, జేబీఎస్‌ నుంచి నడుస్తాయి. యాదగిరిగుట్ట, పరకాల, జనగాం, నర్సంపేట, మహబూబాబాద్‌, వరంగల్, తొర్రూర్‌ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, ఉప్పల్‌ బస్‌ స్టేషన్‌ నుంచి నడువనున్నాయి.
నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి నడుస్తాయన్నారు.

Read More: 7వందల కోట్లు దాటిన గ్రేటర్ వరద నష్టం

జంటనగరాల్లోని శివారు ప్రాంతాల్లో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులను నడపున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించనున్నారు. అయితే ప్రతీ ఏడాది దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు నడిపేవారు అయితే ఈసారి ఇరు రాష్ట్రాల మధ్య సరైన ఒప్పందం లేక సర్వీసులకు బ్రేక్ పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.