యాప్నగరం

YSRTP: షర్మిల పాదయాత్రకి బాబాయ్ సపోర్ట్.. రంగంలోకి ఏపీ కీలక నేత

మహేశ్వరం మండలం నాగారం నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. వైఎస్ షర్మిలని వైసీపీ కీలక నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Samayam Telugu 24 Oct 2021, 3:05 pm
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకి అనూహ్య మద్దతు లభించింది. వైసీసీ కీలక నేత, టీటీడీ చైర్మన్, షర్మిల బాబాయి వైవీ సుబ్బారెడ్డి షర్మిల పాదయాత్రకి సంఘీభావం తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రంగారెడ్డి జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. మహేశ్వరం మండలం నాగారం నుంచి ఈరోజు షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి షర్మిలను కలిసి సంఘీభావం ప్రకటించారు. నాగారం వద్ద పాదయాత్రలో ఆమెను కలిసినట్లు తెలుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ys sharmila


ఏపీ సీఎం, అన్న వైఎస్ జగన్‌తో షర్మిలకు విభేదాలున్నాయని ప్రచారం జరిగింది. తెలంగాణలో పార్టీ ఏర్పాటుతో తమకు సంబంధం లేదని వైఎస్సార్సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు కూడా. జగన్, షర్మిల మధ్య భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని.. విభేదాలు కావని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు షర్మిల సొంత నిర్ణయమని.. దానితో తమకు సంబంధం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల గతంలోనే చెప్పారు.

ఇప్పటి వరకూ వైసీపీ నేతలు.. జగన్ సన్నిహితులెవరూ వైఎస్ షర్మిలకి మద్దతుగా మాట్లాడింది లేదు. కానీ అనూహ్యంగా సొంత బాబాయి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఏకంగా షర్మిల పాదయాత్రలో కలవడం.. ఆమెకు సంఘీభావం తెలపడం హాట్‌టాపిక్‌గా మారాయి. ఏపీలో కీలక నేతగా ఉన్న సుబ్బారెడ్డి సీఎం జగన్‌ ఆదేశాలతోనే వైఎస్ షర్మిలను కలిశారా? బిడ్డ యోగక్షేమాలు తెలుసుకునేందుకు బాబాయి వచ్చారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.