యాప్నగరం

శ్రావణి సూసైడ్ కేసు: సాయితో గొడవ.. బయటపడ్డ సీసీటీవీ దృశ్యాలు.. వీడియో

Manasu Mamata Serial Sravani: సాయి కృష్ణారెడ్డిని రేపు విచారించనున్న నేపథ్యంలో ఈ వీడియో కీలకంగా మారే అవకాశం ఉంది. అతడిని విచారిస్తే ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు బయట పడనున్నాయి.

Samayam Telugu 11 Sep 2020, 10:51 pm
మనసు మమత, మౌనరాగం సీరియళ్ల నటి శ్రావణి ఆత్మహత్య కేసు వ్యవహారం రోజుకు పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు నిందితుడు దేవరాజ్‌ను అదుపులోకి తీసుకొని రెండో రోజు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం మరో వీడియో విడుదలైంది. అయితే, ఇది సీసీటీవీ వీడియో కావడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు ఈ కేసులో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 7న దేవరాజ్‌ రెడ్డితో కలిసి శ్రావణి పంజాగుట్టలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సందర్భంలో అక్కడికి వచ్చిన సాయి కృష్ణారెడ్డి ఆమెతో గొడవకు దిగి.. ఆటోలో ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు ఈ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు ఈ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Samayam Telugu గొడవ పడుతున్న శ్రావణి, సాయి
tv actress sravani and sai krishna Conflicts on road, cctv footage came out


సాయి కృష్ణారెడ్డిని రేపు విచారించనున్న నేపథ్యంలో ఈ వీడియో కీలకంగా మారే అవకాశం ఉంది. అతడిని విచారిస్తే ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు బయట పడనున్నాయి. దేవరాజ్‌ను శ్రావణి ప్రేమించినట్టు గుర్తించిన పోలీసులు.. మరి అతడిపై ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందనే విషయంపైనా పోలీసులు దృష్టిపెట్టారు.

Must Read: స్వలింగ సంపర్కానికి బ్యాంకు అధికారి ఒప్పందం.. వెళ్లి చూస్తే షాక్! చివరికి ఇద్దరిపైనా కేసు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.