యాప్నగరం

విషాదం.. నాటు పడవ బోల్తా పడి ఇద్దరు మృతి

చేపలు పట్టేందుకు వాగులో ఐదుగురు కలిసి వెళ్లారు. అయితే ప్రమాద వశాత్తు పడవ బోల్తా పడింది. దీంతో ఇద్దరు వాగులో గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.

Samayam Telugu 26 Oct 2020, 12:11 pm
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భీమారo మండలం గొల్లవాగు ప్రాజెక్టు లో నాటుపడవ మునిగింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు నీటిలో గల్లంతై మృతి చెందారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మండల కేంద్రానికి చెందిన సుంకరి సంపత్ టాటా ఏసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మరో ట్రాలీ డ్రైవర్ ఇరవేని రాజా బాపు, కలవేని రమేష్ , మచ్చ రవి ,బొంతల రమేష్ కలిసి మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లారు.
Samayam Telugu బోటు ప్రమాదం
boat accident (file)


Read More: వరుసకు అన్నతో ప్రేమ వ్యవహారం.. అనుమానాస్పద మృతి

వాగులో నాటు పడవ సహాయంతో చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు పడవ మునుగగా బొంతల రమేష్ , ఇరవేని రాజబాపు ఇద్దరు కూడా వాగులో గల్లంతు అయ్యారు. కాగా సుంకరి సంపత్, కాలేవిని రమేష్ , మచ్చ రవిలు ప్రాణాలతో బయట పడ్డారు. గల్లంతైన వారి కోసం శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్, ఆర్డీఓ రమేష్ ఆధ్వర్యంలో ముమ్మరంగా సింగరేణి రెస్క్యూ బృందం చర్యలు చేపట్టింది. మరోవైపు ఇటీవల కురిసన భారీ వర్షాలు కారణంగా వాగులో నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. పండగ అయిన మరుసటి రోజే ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.