యాప్నగరం

127 మందికి ఆధార్ నోటీసులు: సంచలన విషయాలు వెలుగులోకి .. అతనే అసలు సూత్రధారి

Hyderabad: ఈ వ్యవహారంపై విచారణలో భాగంగా ఆధార్ సంస్థకు రాష్ట్ర పోలీసులు లేఖ రాశారు. పోలీసులు రాసిన లేఖపై స్పందించిన ఆధార్ సంస్థ యాజమాన్యం 127 మంది రొహింజ్యా ముస్లింలకు నోటీసులు జారీ చేసింది.

Samayam Telugu 20 Feb 2020, 12:34 pm
ఉడాయ్ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-యూఐడీఏఐ) సంస్థ హైదరాబాద్‌లో 127 మందికి నకిలీ ఆధార్‌లు ఉన్నాయని వారికి నోటీసులు జారీ చేయడంపై సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. అయితే, 127 మంది నోటీసులు అందుకున్న వారిలో సత్తార్ ఖాన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. 2018లో రోహింజ్యా ముస్లింలకు నకిలీ పత్రాలు సృష్టించి ఆధార్ కార్డులు ఇప్పించినట్టు సత్తార్‌పై సీసీఎస్‌లో కేసు నమోదై ఉంది. అంతేకాక, పాతబస్తీలో పలువురు బ్రోకర్లు నకిలీ పత్రాలు సృష్టించి 127 మంది రోహింజ్యాలకు ఆధార్ నమోదు చేయించి ఇచ్చినట్లుగా వెల్లడైంది.
Samayam Telugu Aadhaar Hyderabad


ఈ వ్యవహారంపై విచారణలో భాగంగా ఆధార్ సంస్థకు రాష్ట్ర పోలీసులు లేఖ రాశారు. పోలీసులు రాసిన లేఖపై స్పందించిన ఆధార్ సంస్థ యాజమాన్యం 127 మంది రొహింజ్యా ముస్లింలకు నోటీసులు జారీ చేసింది. తమ పౌరసత్వాన్ని నిరూపించే సరైన పత్రాలతో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆధార్ సంస్థ నోటీసుల్లో పేర్కొంది.

Must Read: హీరోయిన్ రష్మిక ఫోటోపై జగిత్యాల కలెక్టర్ కామెంట్.. పోలీసులకు ఫిర్యాదు

నోటీసులు అందుకున్న 127 మందిలో భారత దేశ పౌరులు అయితే కనుక సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. లేకపోతే ఇతర దేశం నుంచి వలస వచ్చినట్టు ఆధారాలు చూపించాలని ఆధార్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. పౌరసత్వాన్ని నిరూపించే ఏ పత్రాలూ కనుక లేకుంటే ఆధార్‌ను రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Also Read: కలెక్టర్ల కన్నా ఎక్కువ జీతాలు.. అయినా పని చేయరా? నిలదీసిన మంత్రి హరీశ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.