యాప్నగరం

ఉజ్జయిని మహాకాళి బోనాలు ప్రారంభం

Bonalu 2020: ఆలయ చరిత్రలో తొలిసారిగా భక్తులు, సందడి లేకుండానే ఈసారి బోనాలు జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి వల్ల ఎవరినీ అనుమతించడం లేదు.

Samayam Telugu 12 Jul 2020, 8:31 am
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆలయం ఆషాఢమాస బోనాల శోభను సంతరించుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంగళహారతి ఇచ్చారు. ఇందుకు సంబంధించి శనివారం సాయంత్రానికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా భక్తులు, సందడి లేకుండానే ఈసారి బోనాలు జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి వల్ల ఎవరినీ అనుమతించడం లేదు. కేవలం అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలోనే ఉత్సవాలు జరగనున్నాయి. పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు.
Samayam Telugu ఉజ్జయిని మహాకాళి బోనాలు ప్రారంభం
ujjain mahankali bonalu


ఆదివారం మంత్రి తలసాని కుటుంబ సభ్యులు తమ నివాసం నుంచి తొలి బోనాన్ని ఆలయం వద్దకు తీసుకువచ్చారు. తొలి బోనం ఆలయం బయట పండితులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ అందజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ నివాసం నుంచే అమ్మ వారికి ఏటా తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడి నుంచి ఆలయ ఈఓ, అర్చకులు బోనాన్ని తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.

అయితే, ప్రత్యక్ష ప్రసారంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు, కరోనా నేపథ్యంలో ఆలయంలోనే నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శనివారం తెలిపారు. ప్రజలంతా ఇళ్లలోనే అమ్మవారికి బోనాలు సమర్పించాలని, ఆలయానికి రావద్దని సూచించారు. శనివారం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి ఆలయం వద్ద బోనాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

మద్యం షాపులు బంద్
బోనాల సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, నార్త్ జోన్లలోని వైన్స్ షాప్‌లను మూసేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గోపాలపురం డివిజన్ పరిధిలోని గోపాలపురం, చిలకలగూడ, లాలాగూడ, తుకారాంగేట్, మహంకాళి డివిజన్ పరిధిలోని మహంకాళి మార్కెట్, కార్ఖానా, మారేడుపల్లి, బేగంపేట డివిజన్ పరిధిలోని బేగంపేట, తిరుమలగిరి, సెంట్రల్ జన్ పరిధిలోని రాంగోపాల్‌పేట, గాంధీ నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలోని వైన్స్ షాపులు ఆదివారం మూత పడనున్నాయి.

Must Read: గాంధీ ఆస్పత్రిలో రోబో విధులు.. నిమిషాల్లోనే కరోనా‌ ఖతంAlso Read: రైతుబంధుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. వాళ్లకూ అందేలా ఆదేశం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.