యాప్నగరం

కరోనా బాధితులకు సర్కార్ షాకింగ్ న్యూస్.. ఖుషీలో ప్రైవేటు హాస్పిటళ్లు

Telangana Coronavirus: కరోనా పేషెంట్లకు చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు ఎంత ఫీజులు వసూలు చేయాలనే దానిపై గత నెలలో జీవో విడుదల చేశారు. తాజాగా దానికి కొన్ని నిబంధనలు చేర్చారు.

Samayam Telugu 27 Jul 2020, 12:00 am
కరోనా సోకిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం చేదు వార్త ప్రకటించింది. కరోనా పేషెంట్లకు చికిత్స అందించడంలో ప్రైవేటు ఆస్పత్రులు ఎంత ఫీజులు వసూలు చేయాలనే దానిపై గత నెలలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 15, జులై 6 తేదీల్లో వీటికి సంబంధించిన జీవోలను విడుదల చేసింది. కరోనా చికిత్స సమయంలో ఏ రకమైన పడకకు ఎంత ఫీజు వసూలు చేయాలనేది వాటిలో నిర్దేశించారు. అయితే, తాజాగా ఆ ఉత్తర్వులకు అదనంగా మరో నిబంధనను అందులో చేర్చారు. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Corona tests


తాజా నిబంధనల ప్రకారం.. గతంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కొన్ని సందర్భాల్లో వర్తించవు. అవి.. కరోనా సోకిన రోగి ఆరోగ్య బీమా కింద ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా ప్రభుత్వం సూచించిన ధరలు వర్తించవు. స్పాన్సర్‌ షిప్ గ్రూపులు, కార్పొరేట్ సంస్థలు ఆస్పత్రులతో ఒప్పందాలు, ఎంఓయూలు చేసుకున్న పక్షాల్లోనూ కరోనా చికిత్సకు ధర ప్రభుత్వం నిర్దేశించినవి వర్తించబోవని ప్రకటలో పేర్కొన్నారు. Must Read: undefined

గత నెలలో ప్రభుత్వం కరోనా చికిత్సకు నిర్దేశించిన ధరలివీ..
* ఐసోలేషన్ సాధారణ వార్డులోని పడకకు రూ. 4వేలు
* ఐసీయూలో వెంటిలేటర్ లేకుండా రూ.7,500
* ఐసీయూలో వెంటిలేటర్‌తో కలిపి రూ.9 వేలు
* ప్రైవేటు ఆస్పత్రి లేదా ల్యాబ్‌కు వచ్చి కరోనా పరీక్ష (పీసీఆర్ టెస్ట్) చేయించుకుంటే రూ.2,200
* ఇదే రకం కరోనా పరీక్ష కోసం నమూనాలు ఇంటి వద్ద సేకరిస్తే రూ.2,800

అయితే, ఈ నిర్దేశించిన ధరలకు అదనంగా పీపీఈ కిట్లు, మందులు వంటి ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. చికిత్స సమయంలో చేసే సీటీ-స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్ వంటి కొన్ని రకాల పరీక్షలు చేస్తే వాటికి కూడా విడిగానే చెల్లించాల్సి ఉంటుందని ఆ జీవోలో పేర్కొన్నారు. Must Read: ‘సాఫ్ట్‌వేర్ శారద’పైనా స్పందించిన సోనూసూద్.. పొద్దున ట్రాక్టర్, ఇప్పుడిలా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.