యాప్నగరం

పది పరీక్షలు రాసిన వీణ, వాణి.. ఎమ్మెల్యే స్పెషల్ గిఫ్ట్

Yousufguda: నిర్దేశిత సమయానికి అరగంట ముందే వీణ, వాణి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. యూసఫ్‌గూడలోని స్టేట్ హోం నుంచి సూపరింటెండెంట్ సఫియా ప్రత్యేక అంబులెన్స్‌లో అవిభక్త కవలలిద్దరినీ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు.

Samayam Telugu 19 Mar 2020, 6:04 pm
హైదరాబాద్‌కు చెందిన అవిభక్త కవలలైన వీణ, వాణి గురువారం పదో తరగతి పరీక్షలు రాశారు. హైదరాబాద్ మధురానగర్‌లోని ప్రతిభా హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో వీరిద్దరూ మొదటి పరీక్ష రాశారు. నిర్దేశిత సమయానికి అరగంట ముందే వీణ, వాణి అక్కడికి చేరుకున్నారు. యూసఫ్‌గూడలోని స్టేట్ హోం నుంచి సూపరింటెండెంట్ సఫియా ప్రత్యేక అంబులెన్స్‌లో అవిభక్త కవలలిద్దరినీ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు.
Samayam Telugu veena vani


Also Read: కరీంనగర్‌లో ఇండోనేసియన్లపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అక్కడికి చేరుకొని వీణ, వాణీలకు ఆల్ ది బెస్ట్ చెప్పడంతోపాటు ఇద్దరికీ పెన్నులను బహూకరించారు. వీరిద్దరికీ పదోతరగతి బోర్డు వేర్వేరుగా హాల్‌ టికెట్లను కేటాయించింది. ఇద్దరూ ఒకేసారి పరీక్ష రాయడానికి వీలులేకపోవడంతో స్టేట్ హోం అధికారులు వీరికి ఇద్దరు సహాయకులను కూడా కేటాయించారు. పరీక్ష రాసేందుకు ఇద్దరికీ తొమ్మిదో తరగతికి చెందిన విద్యార్థులను సహాయకులుగా నియమించారు.

Also Read: కరోనాపై సీఎం దొర అలా అనుకుంటున్నారేమో.. విజయశాంతి గట్టి కౌంటర్

Also Read: 3 రోజుల్లో 3 దేశాలు తిప్పారు.. తిండి, నిద్ర లేదు.. తెలుగు విద్యార్థుల ఆవేదన

Must Read: కరీంనగర్‌లో ఇండోనేసియా బృందం ఏం చేసింది? సీసీటీవీ దృశ్యాలు వైరల్

అంతేకాక, సాధారణ విద్యార్థుల కంటే వీణ, వాణీలకు అరగంట ఎక్కువగా పరీక్షా సమయం కేటాయించారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వీణ వాణీ మాస్కులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. మిగతా విద్యార్థులు కూడా మాస్కులు, శానిటైజర్లతో పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు.

Also Read: ‘‘కరోనాతో మరో 2 వారాలు గడ్డు కాలమే.. పారాసిటమాల్ పాత్ర ఏంటంటే..’’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.