యాప్నగరం

చంద్రాయణ్‌గుట్ట కానిస్టేబుల్‌పై దుండగుల దాడి.. అదే కారణమా..

Hyderabad Lockdown updates: చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రవీణ్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గుర్తుతెలియని ఆ వ్యక్తులు కర్రలతో దాడి చేయడంతో ప్రవీణ్ తీవ్ర గాయాల పాలయ్యాడు.

Samayam Telugu 4 Apr 2020, 8:59 pm
హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్‌పై దాడి జరగడం కలకలం రేపుతోంది. లాక్ డౌన్ వేళ నిరంతరంగా శ్రమిస్తున్న పోలీసుపై దాడి జరగడం చర్చనీయాంశమైంది. ప్రజల కోసమే పోలీసులు పని చేస్తున్నా పోలీసులపై అక్కడ అక్కడ కొంత మంది యువకులు దాడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Samayam Telugu 7b076598-fa9c-461a-8e9d-4fac58a926b1.


Also Read: ఎక్కడికెల్లో ఎయిడ్స్ అస్తున్నదట.. వృద్ధుడి మాటలకు మంత్రి హరీశ్‌ షాక్.. తమాషా సంభాషణ

చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రవీణ్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గుర్తుతెలియని ఆ వ్యక్తులు కర్రలతో దాడి చేయడంతో ప్రవీణ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే గాయపడిన కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ను డీఆర్డీఎల్ ఆపోలో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఫలక్‌నుమా ఏసీపీ మజీద్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్‌ను పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Must Read: లైట్లన్నీ ఆపేస్తే పవర్ గ్రిడ్ కుప్పకూలుతుందా? ఏది నిజం? నిపుణుల వివరణ

ఆకతాయిలే ఈ పని చేసినట్లుగా భావిస్తున్నారు. రోడ్లపై తిరిగినందుకు లాఠీ ఝుళిపించడంతో ఆగ్రహించిన ఆకతాయిలు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అంటున్నారు.

Also Read: దీపం పెట్టి చూడు నీక్కూడా జ్ఞానం వస్తది.. మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాది: బండి సంజయ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.