యాప్నగరం

వారు నిజంగానే చనిపోవాలని కోరుకుంటున్నారా? ఒవైసీకి కిషన్ రెడ్డి చురకలు

Lockdown Extension in India: కరోనాను మతం కోణంలో చూడొద్దని.. వాళ్లను అవమానించవద్దని కిషన్ రెడ్డి అన్నారు. ఒవైసీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని, కరోనాతో చనిపోయినవాళ్లు అమర వీరులు, అల్లా దగ్గరకు వెళ్లినవారు అంటూ చేసిన వ్యాఖ్యల అర్థం ఏంటని ప్రశ్నించారు.

Samayam Telugu 11 Apr 2020, 5:21 pm
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లాక్ డౌన్ గురించి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి చురకలంటించారు. కరోనాతో మరణించిన వారంతా అమరులని ఒవైసీ అన్న వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. అమర వీరులు అని చెబుతున్నారంటే కరోనా వచ్చిన వారంతా మరణించాలని కోరుకుంటున్నారా అని కిషన్ రెడ్డి చురకలంటించారు. శనివారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులన్నీ మర్కజ్ వల్ల వ్యాప్తి చెందినవే అని చెప్పారు.
Samayam Telugu kishan reddy


కరోనాను మతం కోణంలో చూడొద్దని.. వాళ్లను అవమానించవద్దని కిషన్ రెడ్డి అన్నారు. ఒవైసీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని, కరోనాతో చనిపోయినవాళ్లు అమర వీరులు, అల్లా దగ్గరకు వెళ్లినవారు అంటూ చేసిన వ్యాఖ్యల అర్థం ఏంటని ప్రశ్నించారు. అంటే చనిపోవాలని పరోక్షంగా చెప్పడమేనా? అని నిలదీశారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో మాత్రమే ఉందని కిషన్ రెడ్డి వివరించారు. మన దేశ వాతావరణ పరిస్థితులు, జీవన విధానాల ప్రభావంతో కరోనా 28 లేదా 30 రోజులకు కూడా బయటపడ్డ దాఖలాలున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. కొందరికైతే చనిపోయేవరకు తెలియని సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు.

Must Read: లాక్‌డౌన్‌ను వాటికి తప్పించి కొనసాగించండి.. మోదీకి కేసీఆర్ కీలక సూచనలు

ప్రధాని మోదీ అందరు ముఖ్యమంత్రులతో పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్ డౌన్ పొడిగింపు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. లాక్ డౌన్ విషయంలో మరో 24 గంటల్లో స్పష్టత వస్తుందని, ప్రధాని మోదీ ఈ విషయాన్ని స్వయంగా ప్రజలకు తెలియజేస్తారని ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.