యాప్నగరం

నిఖిల్ పెళ్లిపై కిషన్ రెడ్డి తీవ్ర స్పందన, రాహుల్‌‌ గాంధీ వ్యాఖ్యలపైనా..

Kishan Reddy: లాక్‌ డౌన్‌ నిబంధనలు ప్రజా ప్రతినిధులే ఉల్లంఘిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. గతేడాది తన తల్లి మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇటీవల ఆ సంవత్సరీకాన్ని కూడా తాను ఆన్‌లైన్‌‌లోనే, తాను ఒక్కడినే నిర్వహించుకున్నట్లు గుర్తు చేశారు.

Samayam Telugu 17 Apr 2020, 5:19 pm
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కొడుకు హీరో నిఖిల్‌ కుమార స్వామి పెళ్లిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. లాక్ డౌన్ సమయంలో ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి ఈ పెళ్లి చేయడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఈ విపత్కర సమయంలో పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. కరోనాపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 20 మందికి మించిన వ్యక్తులు గుమికూడదనే నిబంధనను గుర్తు చేశారు. ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులే ఇలా నిబంధనలు ఉల్లంఘించడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. లాక్‌ డౌన్‌ నిబంధనలు ప్రజా ప్రతినిధులే ఉల్లంఘిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. గతేడాది తన తల్లి మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇటీవల ఆ సంవత్సరీకాన్ని కూడా తాను ఆన్‌లైన్‌‌లోనే, తాను ఒక్కడినే నిర్వహించుకున్నట్లు గుర్తు చేశారు.
Samayam Telugu Wedding


రాహుల్‌ను డబ్ల్యూహెచ్ఓకు ఛైర్మన్ చేయాలి!
మరోవైపు, కరోనాను అరికట్టేందుకు లాక్‌ డౌన్‌ శరణ్యమని ప్రపంచమంతా ఆ విధానం అనుసరిస్తోంటే.. రాహుల్‌ గాంధీ మాత్రం విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టెస్టులు చేసినంత మాత్రాన కరోనా తగ్గుతుందని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. రాహుల్‌ని డబ్ల్యూహెచ్ఓకు చైర్మన్‌గా నియమిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

Also Read: undefined

దేశంలో కరోనా కేసులు సంఖ్య వచ్చే నెల 3 కల్లా తగ్గే అవకాశం ఉందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా కరోనా కేసులు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగలేదని, నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ కార్యక్రమం వల్లే 58 శాతం కేసులు వచ్చాయని అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన వలస కూలీలు అక్కడే ఉండాలని సూచించారు. ఇందుకోసం తెలంగాణకు రూ.280 కోట్లు, ఏపీకి రూ.500 కోట్లు పంపించినట్లు కిషన్‌ రెడ్డి చెప్పారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.