యాప్నగరం

సీఏఏతో ఎవరికి నష్టమో చెప్పండి.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

Yousufguda: గతంలో బీజేపీ ఎంపీలు.. సీఏఏ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డ సంగతి తెలిసిందే. బాంబు దాడులకు పాల్పడే వారికి పౌరసత్వం ఇవ్వాలా? అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Samayam Telugu 18 Feb 2020, 11:06 am
సీఏఏతో ఎవరికి నష్టమో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్‌ చేశారు. అత్యధిక మెజారిటీతో పార్లమెంటు ఆమోదం పొందిన సీఏఏను రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యతిరేకిస్తుందని ఆయన ప్రశ్నించారు. యూసఫ్‌గూడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. దేశ ప్రగతి కోసం కృషి చేస్తున్న ప్రధాని మోదీపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
Samayam Telugu kishan reddy


130 కోట్ల మంది భారతీయుల్లో సీఏఏ కారణంగా ఏ ఒక్కరికీ నష్టం జరగదని కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఏఏపై అవగాహన కల్పించేందుకు వచ్చే నెలలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరవుతారని తెలిపారు.

Also Read: పంజాగుట్టలో దొంగల హల్‌చల్.. తలపై సుత్తితో మోది చోరీ

అయితే, గతంలో బీజేపీ ఎంపీలు.. సీఏఏ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డ సంగతి తెలిసిందే. బాంబు దాడులకు పాల్పడే వారికి పౌరసత్వం ఇవ్వాలా? అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. సీఏఏతో దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం లేదన్న విషయాన్ని గుర్తించాలని చెప్పారు. మరోవైపు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు సైతం సీఏఏతో భారత ముస్లింలకు ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని బీజేపీ అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్‌ రావు కూడా అన్నారు.

Must Read: కరోనా ఎఫెక్ట్: రాష్ట్రంలో విద్యుత్ రంగానికి ఇబ్బందులు

Also Read: మళ్లీ పెరిగిన పాల ధరలు.. రెండు నెలల్లోనే 2 సార్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.