యాప్నగరం

మేనిఫెస్టో మొదటి పేజీ కూడా మారలేదు.. కేసీఆర్‌పై కేంద్రమంత్రి విమర్శలు

టీఆర్ఎస్ పార్టీకి పాపం మేనిఫెస్టో తయారు చేయడానికి కూడా టైం లేకపోయిందన్నారు. అందుకే పాత మేనిఫెస్టోనే మళ్లీ రిలీజ్ చేశారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Samayam Telugu 23 Nov 2020, 4:22 pm
గ్రేటర్ ఎన్నికల వేళ అధికార పార్టీ టీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ మేనిఫెస్టో పొంతన లేని విధంగా ఉందన్నారాయన. గతంలో ఇచ్చిన హామీలనే ప్రకటించారన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో కొత్త దనం ఏదీ లేదన్నారు కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదన్నారు. అక్షరం పొల్లుబోకుండా పాత మేనిఫెస్టోనే ఇచ్చారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ మాటలకు చేతలకు పొంతన ఉండదన్నారు. తాగునీటి అవసరాలు తీరుస్తానని ఇప్పటికే ఎన్నిసార్లు చెప్పారే కేసీఆర్‌కే గుర్తు లేదన్నారు.
Samayam Telugu కిషన్ రెడ్డి
kishan reddy


వరదనీటి నివారణకు మాస్టర్ ప్లాన్.. కూడా గతంలోనే సీఎం చెప్పారన్నారు. ఆరున్నరేళ్లలో వరద నీటి నిర్వహణకు చిన్న పని కూడా చేయకుండా మళ్లీ ఈరోజు అదే మాట, అదే పద్ధతి అదే అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్‌కు మేనిఫెస్టో తయారు చేయడానికి కూడా అవకాశం లేనట్లు ఉందన్నారు. ఎన్నికల తక్కువ సమయంలో రావడంతో పాత మేనిఫెస్టోనే కొత్తగా ముద్రించి జీహెచ్ఎంసీ ప్రజల ముందు పెడుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ మెట్రో రైలు కోసం ఏం చేసిందన్నారు.

Read More: TRS Manifesto: హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ శుభవార్త.. వచ్చేనెల నుంచి నీటి బిల్లు లేదు

హైదరాబాద్‌లో మెట్రో రైలును టీఆర్ఎస్ అడ్డుకుందన్నారు. మెట్రో రైలు అప్జల్ గంజ్ దాటలేదన్నారు. రెండున్నరేళ్లు లేటుగా మెట్రో వచ్చిందన్నారు. పాతబస్తీని మెట్రో రైలుకు దూరం చేసింది మీ పార్టీ కాదా అని ప్రశ్నించారు. పాత నగర ప్రజల్ని ఓటు హక్కే నైతిక హక్కు టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలకు ఉందా అంటూ నిలదీశారు. హైదరాబాద్‌ను విశ్వనగరం కాదు.. విషాద నగరం చేశారన్నారు. వరదల్లో 40మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆరు లక్షల 56వేల కుటుంబాలకు ఇంకా వరద సాయం అందలేదన్నారు. ఇళ్లలోకి నీరు వచ్చి ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఏ రకంగా ఇది విశ్వనగరం అవుతుందని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.