యాప్నగరం

KCR Akhilesh Yadav Meeting: కేసీఆర్‌తో అఖిలేష్ భేటీ.. థర్డ్ ఫ్రంట్ దిశగా కీలక ముందడుగు!?

KCR Akhilesh Yadav Meeting | దేశ రాజధానిలో ఉన్న సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, సమస్యల గురించి వారిద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 21 May 2022, 5:20 pm

ప్రధానాంశాలు:

  • ఢిల్లీలో కేసీఆర్‌ను కలిసిన అఖిలేష్ యాదవ్
  • ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘ చర్చలు
  • థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులు..?
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu kcr akhilesh yadav
Akhilesh Yadav Meets KCR in Delhi
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను యూపీ కీలక నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ దేశానికి సంబంధించిన అనేక సమస్యలపై చర్చించారు. గత కొన్నాళ్లుగా టీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య మైత్రి బలపడుతోంది. యూపీ ఎన్నికల్ల ఎస్పీ తరఫున ప్రచారానికి సైతం కేసీఆర్ సిద్ధపడ్డారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేపట్టిన సమయంలో అఖిలేష్ యాదవ్ సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్ థర్డ్ ప్రయత్నాలకు.. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో బలమైన పార్టీ నేతగా ఉన్న అఖిలేష్ యాదవ్ మద్దతు కీలకం కానుంది.
ఇక కేసీఆర్ ఢిల్లీ పర్యటన విషయానికి వస్తే.. దేశరాజధానిలో ఆయన రాజకీయ, మీడియా, ఆర్థిక రంగాలకు చెందిన పలువురు నిపుణులతో భేటీ కానున్నారు. గాల్వాన్ ఘటనలో ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం అందజేయనున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సమయంలో మరణించి రైతు కుటుంబాలనూ కేసీఆర్ కలవనున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన ఛండీగఢ్ బయల్దేరి వెళ్తారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ మరణించిన 600 రైతుల కుటుంబాలను కేసీఆర్ కలుస్తారు. ఒక్కో రైతు కుటుంబానికి 3 లక్షల కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ పాల్గొంటారు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలకు చెందిన రైతుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తారు.

మే 26న బెంగళూరు వెళ్లే కేసీఆర్.. మాజీ ప్రధాని దేవేగౌడను కలుస్తారు. అక్కడి నుంచి మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి వెళ్లి అన్నా హజారేను కలుస్తారు. ఆ తర్వాత షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు.

మే 29, 30 తేదీల్లో కేసీఆర్ పశ్చిమ బెంగాల్, బిహార్ వెళ్తారు. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను కలిసి వారికి ఆర్థిక సాయం అందజేస్తారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.