యాప్నగరం

ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకాలికి తీవ్ర గాయం.. టీకాంగ్రెస్ ట్వీట్

Telangana Congress: తమ అధ్యక్షుడు ఉత్తమ్ త్వరగా కోలుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డాక్టర్ జే గీతా రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

Samayam Telugu 1 Aug 2020, 7:29 pm
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్పత్రి పాలయ్యారు. ఆయన మోకాలికి గాయమైంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మోకాలికి తీవ్ర గాయమైన పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరగా కోలుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కోరుకుంటున్నట్లుగా ఓ చిత్రాన్ని కూడా పోస్ట్ చేశారు. ఆ చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకాలి పట్టీ (నీ క్యాప్) ధరించారు. నడవడం కష్టంగా ఉండడంతో వాకర్ పట్టుకొని నెమ్మదిగా నడుస్తున్నారు. అయితే, ఈ గాయం ఎలా అయిందో స్పష్టం చేయలేదు.
Samayam Telugu ఉత్తమ్ కుమార్ రెడ్డి
uttam kumar reddy


తమ అధ్యక్షుడు ఉత్తమ్ త్వరగా కోలుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డాక్టర్ జే గీతా రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘‘యుద్ధ విమానాలు నడిపే మాజీ పైలట్ మాత్రమే కాదు.. పుట్టుకతోనే పోరాటయోధుడు. ఉత్తమ్ గారు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం.’’ అని గీతారెడ్డి ట్వీట్ చేశారు.
Must Read: undefined

మరోవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు ఆపడం లేదు. సీఎం కేసీఆర్ అస‌మ‌ర్థత‌ వల్ల కృష్ణా నీళ్లన్నీ ఆంధ్రాకే వెళుతున్నాయ‌ని విమర్శించారు. సంగమేశ్వర్ దగ్గర రోజుకు 3 టీఎంసీ నీళ్లను ఏపీ ప్రభుత్వం తీసుకుపోతుంటే కేసీఆర్ మౌనం వ‌హించ‌డం ప‌లు అనుమానాలు కలిగిస్తుంద‌న్నారు. పోతిరెడ్డిపాడును అడ్డుకోకుండా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కేవలం రెండు టీఎంసీల సామ‌ర్థ్యం గ‌ల‌ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్.. పోతిరెడ్డిపాడు నుంచి 6 టీఎంసీల నీళ్లను తెలంగాణ నష్టపోతుంటే ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తుగ్లక్ గురించి చరిత్రలో చదివానని, కానీ ఇప్పుడు స్వయంగా కేసీఆర్‌ను తుగ్లక్‌గా చూస్తున్నానని ఉత్తమ్ విమర్శిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.