యాప్నగరం

Municipal Elections: ‘ఇల్లు అలా ఉంటే మున్సిపల్‌ పన్ను రద్దు’

Telangana Congress: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విజన్‌ డాక్యుమెంట్‌ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విడుదల చేశారు. గాంధీ భవన్‌ నుంచి ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

Samayam Telugu 17 Jan 2020, 11:05 am
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాము గెలిచే ప్రాంతాల్లో కొత్త భవన క్రమబద్దీకరణ (బిల్డింగ్ రెగ్యూలరైజేషన్ స్కీమ్ - బీఆర్ఎస్) అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాక, 500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో ఉన్న ప్రతి ఇంటికీ మున్సిపల్ పన్నును రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికి ఉచితంగా నల్లా కనెక్షన్‌ ఇస్తామని పేర్కొంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విజన్‌ డాక్యుమెంట్‌ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విడుదల చేశారు. గాంధీ భవన్‌ నుంచి ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ 24 పాయింట్లతో కూడిన ఈ డాక్యుమెంటును రూపొందించింది. అందులోని ముఖ్యాంశాలివీ..
Samayam Telugu uttam


Also Read: Hyderabad: మరింత పెరగనున్న చలి.. ఆ ప్రాంతాల్లో ఇంకా!

అవినీతి రహితంగా మునిసిపాలిటీలను తీర్చి దిద్దుతారు. రోడ్లు, అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీలు, ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు. మున్సిపాలిటీల పరిధిలో స్వచ్ఛంద సేవా సంస్థల తోడ్పాటుతో రూ.5కే మధ్యాహ్న, రాత్రి భోజన పథకం అమలు. పార్కులు, గ్రీన్‌ బెల్టులు, చెరువుల సుందరీకరణ, బతుకమ్మ ఘాట్ల నిర్మాణం. యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు. ఇన్‌డోర్‌ స్టేడియం, క్రీడా మైదానాలు, జిమ్‌ల ఏర్పాటు. ఇంటర్నెట్‌ సౌకర్యంతో కూడిన గ్రంథాలయాలు, ఉచిత వైఫై జంక్షన్‌ల ఏర్పాటు.

Also Read: కాల్ రికార్డుల్లో గుట్టుపై మంత్రి మల్లారెడ్డి స్పందన, కీలక వ్యాఖ్యలు

రజకులకు దోబీఘాట్లు, నాయీ బ్రాహ్మణులు, కుమ్మరి సంఘాలకు వారి వృత్తులు కొనసాగించడానికి భూమి కేటాయింపు. శాంతిభద్రతల మెరుగుదలకు సీసీటీవీల ఏర్పాటు. డంపింగ్‌ యార్డు, వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ ఏర్పాటు. ఆదివాసీ మునిసిపాలిటీల్లో సంప్రదాయ, సాంస్కృతిక నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు. అన్ని మతాలవారికి శ్మశాన వాటికలు, శవ యాత్ర వాహనాల ఏర్పాటు. వివాహాలు, ఇతరత్రా వేడుకల నిర్వహణకు అన్ని వసతులతో కూడిన కన్వెన్షన్‌ సెంటర్ల ఏర్పాటు వంటి వాటిని మేనిఫెస్టోలో ఉంచారు.

Also Read: పాక్ ప్రధాని ఇమ్రాన్‌ భారత పర్యటనకు ఆహ్వానం.. విదేశాంగశాఖ ప్రకటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.