యాప్నగరం

కేసీఆర్‌లా కాదు, మా సీఎం చాలా గ్రేట్.. వేములవాడలో ఒడిశా భక్తురాలి అసహనం

Vemulawada ఆలయంలో ఒడిశాకు చెందిన ఓ భక్తురాలు పోలీసుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 11 Jan 2020, 9:04 pm
సీఎం కేసీఆర్‌కు ఇంత సెక్యూరిటీ అవసరమా అంటూ ఒడిశాకు చెందిన ఓ భక్తురాలు ప్రశ్నిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వేములవాడలో పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాక సందర్భంగా భక్తులకు దర్శనం నిలిపివేయడంతో అసహనానికి గురైన ఆమె పోలీసులను ప్రశ్నించారు. తమ ముఖ్యమంత్రి (నవీన్ పట్నాయక్) 25 ఏళ్లుగా అధికారంలో ఉన్నారని.. ప్రజలను ఏనాడూ ఇలా ఇబ్బంది పెట్టలేదని ఆమె పేర్కొన్నారు. వేములవాడ దేవుడు చాలా గొప్ప అని భావించి, అంత దూరం నుంచి వస్తే.. ఇబ్బందులకు గురి చేయడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu devotee


‘ఇది చాలా అన్యాయం సార్.. ఒడిశా నుంచి వచ్చాం. మీ దేవుడేదో గొప్ప అని మేమొచ్చాం. మీ ముఖ్యమంత్రి దేవుడినే దర్శించుకోనీయకపోతే ఏం ముఖ్యమంత్రి సార్?’ అంటూ సదరు భక్తురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదన్నారు.

Must Read: ప్రభుత్వం ‘కారు’దే, స్టీరింగ్ మా చేతిలో.. ముస్లిం ర్యాలీలో ప్లకార్డులు!

తమ ముఖ్యమంత్రి పూరీ జగన్నాథుడి సందర్శనకు కూడా వస్తారని.. కానీ, ఏ రోజూ 10 నిమిషాలు కూడా భక్తులను నిలిపేయరని భక్తురాలు తెలిపారు. ‘మా సీఎం చాలా గ్రేట్. అందుకే ఆయన 25 ఏళ్లుగా ఆ పదవిలో ఉన్నారు’ అంటూ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌పై ప్రశంసలు కురిపించారు.

‘మా ముఖ్యమంత్రి ప్రజల్లో స్వేఛ్చగా తిరుగుతారు. మీ ముఖ్యమంత్రికి ఇంత భద్రతా? ఆయన మీద ఆయనకే నమ్మకం లేదన్నమాట. ఏ మూల నుంచి ఎవడు కొట్టిస్తాడోనని భయం’ అంటూ ఆ భక్తురాలు చురకలు వేశారు.

Don't Miss: కూర‘గాయా’లు, పప్పులు, నూనెలు అన్నీ పైపైకి.. సంక్రాంతి వేళ సామాన్యుడికి ధరాఘాతం

గతంలో సీఎం కేసీఆర్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సందర్శన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు ఈ వీడియోను వదిలి ఉండవచ్చు. డిసెంబర్ 30న సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. మిడ్ మానేరు జలశయాన్ని సందర్శించారు. అక్కడ గోదారమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చు!

Also Read: వణికిస్తున్న కోతులు.. గ్రామాలను వదిలి పట్టణాలకు, పరిస్థితి తీవ్రం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.