యాప్నగరం

అంబేడ్కర్ వచ్చి అడగాలా కేసీఆర్ గారూ.. విజయశాంతి సూటి ప్రశ్న

Telangana Congress: దళిత ముఖ్యమంత్రి ఊసు పక్కకు పోయిందని విజయశాంతి ఎద్దేవా చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి కూడా రాకుండానే పోయిందని విమర్శించారు. దళిత ఉప ముఖ్యమంత్రుల జాడ కూడా లేదని, ఇది అడగలేని స్థితిలో దొర ప్రభుత్వం నడుస్తోందని ట్వీట్ చేశారు.

Samayam Telugu 15 Apr 2020, 3:06 pm
అంబేడ్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 ఏప్రిల్ 14వ తేదీన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోను విడుదల చేశారు.
Samayam Telugu kcr vijayashanti.


Must Read: undefined

దళిత ముఖ్యమంత్రి ఊసు పక్కకు పోయిందని విజయశాంతి ఎద్దేవా చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి కూడా రాకుండానే పోయిందని విమర్శించారు. దళిత ఉప ముఖ్యమంత్రుల జాడ కూడా లేదని, ఇది అడగలేని స్థితిలో దొర ప్రభుత్వం నడుస్తోందని ట్వీట్ చేశారు. ‘‘ఎప్పుడో 2016లో కేసీఆర్ చెప్పిన మాటల్ని గుర్తుంచుకుని మహానుభావుడు అంబేడ్కర్ జీ వచ్చి, విగ్రహం అడుగుతారా? భవనం అడుగుతారా? నేనియ్యకుంటే.. అన్నట్లు సీఎం దొరగారు భావిస్తున్నట్లు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలేమో...’’ అంటూ విజయశాంతి విమర్శించారు.

Also Read: undefined

మరోవైపు, ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్‌కు మధ్య విరామం ఇవ్వవద్దని, దాన్ని కొనసాగించాలని తీసుకున్న నిర్ణయాన్ని విజయశాంతి సమర్థించారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజా సంక్షేమం దృష్ట్యా లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Must Read: undefined



Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.