యాప్నగరం

నిండు గర్భిణీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చికిత్స.. నొప్పులొస్తే తనకు ఫోన్ చేయాలని సూచన

Lockdown Emergency Numbers: వికారాబాద్‌ జిల్లా మోమీన్‌పేట మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన సుధారాణి అనే మహిళకు కూడా అత్యవసర వైద్యం అవసరమైంది. ఆమె 9 నెలల నిండు గర్భిణి. సుధారాణికి ఎమర్జెన్సీ ఉందని ఆమె భర్త నవరత్నం హెల్ప్‌లైను నంబర్‌కి ఫోన్‌ కాల్‌ చేశాడు.

Samayam Telugu 30 Mar 2020, 3:36 pm
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలంతా నిర్బంధంలో ఉండిపోయారు. ఈ క్రమంలో కొందరికి వైద్యపరమైన ఇతర అత్యవసర సేవలు అనివార్యమవుతున్నాయి. ఇలాంటి ఏ సమస్య ఉన్నా 100 నంబరుకు ఫోన్ చేసి సహాయం పొంద వచ్చని సూచిస్తున్నారు. ప్రభుత్వ సూచనలను చాలా మంది ప్రజలు వినియోగించుకుంటున్నారు.
Samayam Telugu mla


వికారాబాద్‌ జిల్లా మోమీన్‌పేట మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన సుధారాణి అనే మహిళకు కూడా అత్యవసర వైద్యం అవసరమైంది. ఆమె 9 నెలల నిండు గర్భిణి. సుధారాణికి ఎమర్జెన్సీ ఉందని ఆమె భర్త నవరత్నం హెల్ప్‌లైను నంబర్‌కి ఫోన్‌ కాల్‌ చేశాడు. దీంతో వారు స్పందించి వైద్య సాయం ఏర్పాటు చేశారు. ఈలోపు ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌‌కు తెలిసింది. ఆయన వెంటనే సుధారాణి ఇంటికి చేరుకున్నారు.

ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వృత్తి రీత్యా డాక్టర్‌ అన్న సంగతి తెలిసిందే.‌ గర్భిణీ అయిన సుధారాణిని పరీక్షించిన ఆయన, ఆమెకు రక్తం తక్కువగా ఉందని పౌష్టికాహారం బాగా తీసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్‌ సూచించారు. కాన్పుకు ఇంకా 20 రోజుల సమయం ఉందని తెలిపారు. ఈలోపు కనుక పురిటినొప్పులు వచ్చినట్లయితే వెంటనే తనకు ఫోన్‌ చేయాలని ఎమ్మెల్యే తన ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు. సుధారాణికి కావాల్సిన మందుల చీటీని రాసి ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచి నవనీత విష్ణువర్థన్‌ రెడ్డి, నరసింహ రెడ్డి తదితరులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.