యాప్నగరం

కేబుల్ బ్రిడ్జిపై డేంజర్.. ప్రమాదకరంగా జనం తీరు.. వీడియో

Cable Bridge: జలపాతాల దగ్గర, వేగంగా వస్తున్న రైళ్లతో, కొండ అంచులపైనా స్టైల్‌గా నిలబడి ఫోటోలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఈ వార్తలను చూసి కూడా జనం తీరు మారడం లేదు.

Samayam Telugu 2 Oct 2020, 4:19 pm
ఫోటోలు దిగడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా జనాల్లో అవగాహన రావడం లేదు. ఇప్పటికే ఎంతో మంది సెల్ఫీ పిచ్చితో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూశాం. జలపాతాల దగ్గర, వేగంగా వస్తున్న రైళ్లతో, కొండ అంచులపైనా స్టైల్‌గా నిలబడి ఫోటోలు దిగుతూ ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఈ వార్తలను చూసి కూడా జనం తీరు మారడం లేదు.
Samayam Telugu కేబుల్ బ్రిడ్జి
Durgam Cheruvu Cable Bridge


తాజాగా హైదరాబాద్‌లోనూ ఈ సమస్య ఎదురవుతోంది. హైదరాబాద్ దుర్గం చెరువుపై ప్రారంభమైన కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వస్తున్న సందర్శకులు ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో అధికారులు వారాంతాల్లో బ్రిడ్జిపైకి వాహనాల అనుమతిని నిషేధించారు. అయినా వారాంతాల్లో కూడా ప్రమాదకరంగా రోడ్డుకు అడ్డంగా నిలబడి ఫోటోలు దిగుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలను అధికారులు బయటకు విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.