యాప్నగరం

కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన వనపర్తి ఎస్పీ

KTR ట్వీట్‌పై వనపర్తి ఎస్పీ అపూర్వరావు స్పందించారు. కొడుకు ముందే తండ్రిని చితకబాదిన ఘటనలో బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Samayam Telugu 3 Apr 2020, 10:38 pm
నపర్తి జిల్లాలో ఓ కొడుకు ముందే తండ్రిని పోలీసులు చితకబాదిన సంఘటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కేటీఆర్ స్పందించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ ఘటన సహేతుకమైనది కాదని పేర్కొన్నారు. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. లేకపోతే.. వేలాది మంది పోలీసులు చేస్తున్న మంచి పని మసకబారే ప్రమాదం ఉందని ఆయన ట్వీట్ చేశారు.
Samayam Telugu wanapathy


ఈ నేపథ్యంలో ఘటనపై వనపర్తి ఎస్పీ అపూర్వరావు స్పందించారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రజలపై ఇలా ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని ఎస్పీ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్‌ రెడ్డికి హామీ ఇచ్చారు.

వీడియో: కొడుకు వేడుకుంటున్నా తండ్రిని వదలని పోలీసులు



Also Read: కరోనా సోకినా వదలని టిక్‌టాక్ పిచ్చి.. ఐసోలేషన్ వార్డులో యువతి వీడియో, మరో ముగ్గురికి షాక్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.