యాప్నగరం

వరద కాల్వకు గండీ.. నీట మునిగిన ఊరు, భయంతో స్థానికులు

Karimnagar: నిజానికి మూడు రోజుల క్రితమే ఈ వరద కాలువకు గండీ పడింది. అప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేసి అధికారులు మమ అనిపించారు. దీంతో మళ్లీ అక్కడే గండీ ఏర్పడింది. దీంతో నీరంతా ఎగదన్నుకొని బయటకు వచ్చేస్తోంది.

Samayam Telugu 26 Feb 2020, 1:05 pm
Samayam Telugu Capture
వరద కాలువకు గండీ పడి ఊరంతా నీటి మయమైన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కరీంనగర్‌ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి వద్ద వరద కాలువకు గండిపడింది. కాల్వలో ప్రవహిస్తున్న నీరంతా ఊళ్లోకి ప్రవేశించింది. ఆ నీరు నేరుగా ఇళ్లలోకి వచ్చి చేరడంతో స్థానికులు ఆందోళనకుగురయ్యారు. నీటి మట్టం మరింత పెరుగుతుందేమో అని భయపడుతున్నారు.

నిజానికి మూడు రోజుల క్రితమే ఈ వరద కాలువకు గండీ పడింది. అప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేసి అధికారులు మమ అనిపించారు. దీంతో మళ్లీ అక్కడే గండీ ఏర్పడింది. దీంతో నీరంతా ఎగదన్నుకొని బయటకు వచ్చేస్తోంది. మన్నెంపల్లి గ్రామంలోని సుమారు 50 ఇళ్లలోకి నీరు చేరి సామాన్లన్నీ తడిసిపోయాయి. చెక్క వస్తువులు, ఎలక్ట్రానిక్, ధాన్యం బస్తాలు అన్ని తడిసిపోయాయి.

Also Read: దిల్లీ అల్లర్లు: ప్రజలకు హైదరాబాద్ సీపీ కీలక సూచనలు

దాదాపు రెండు గంటల పాటు గ్రామంలో నీటి ప్రవాహం కొనసాగింది. గ్రామ సర్పంచి మేడి అంజయ్య, ఉప సర్పంచి అనిల్‌ గౌడ్‌ వెంటనే స్పందించి జేసీబీని రప్పించి వరద కాలువకు గండీ పడ్డ స్థలంలో నీరు పక్కకు మళ్లేలా మట్టిని పోయించారు. ఆ నీటిని చెరువుకు మళ్లించారు. అధికారులు స్పందించి గండీ పడిన ప్రాతంలో శాశ్వత మరమ్మతులు చేపట్టాలని అధికారులు కోరుతున్నారు.

Also Read: వీడియో: రెండు లారీలు ఢీ.. మధ్యలో ఇరుక్కున్న వ్యక్తి, చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.