యాప్నగరం

మాపై సానుభూతి అక్కర్లేదు.. అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన

Ayodhya Verdict: అయోధ్య తీర్పుపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తీర్పు సంతృప్తి కలిగించలేదని పేర్కొన్నారు. అయితే.. సుప్రీం తీర్పును గౌరవిస్తామని తెలిపారు.

Samayam Telugu 9 Nov 2019, 4:03 pm
యోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు స్థల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు సంతృప్తి కలిగించలేదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం.. అయితే అదే సర్వోన్నతమైనది కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రోజు బాబ్రీ మసీదును కూల్చి ఉండకపోతే.. ఇవాళ ఎలాంటి తీర్పు వచ్చి ఉండేదని ఆయన ప్రశ్నించారు. అయితే.. భారత రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని.. తమ హక్కుల కోసం చివరిదాకా పోరాడతామని పేర్కొన్నారు.
Samayam Telugu asad
అసదుద్దీన్ ఒవైసీ


మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం దానంగా తమకు అక్కర్లేదని అసదుద్దీన్ పేర్కొన్నారు. ‘మాపై సానుభూతి, అభిమానం చూపాల్సిన అవసరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. శనివారం (నవంబర్ 9) అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు కురిపించారు.

Must Read: ఆర్టీసీ నెత్తిన మరో పిడుగు.. పీఎఫ్ ఆఫీస్ నుంచి నోటీసులు

బాబ్రీ మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారని అసదుద్దీన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఒక వర్గం వారికి మాత్రమే అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘అక్కడ బాబ్రీ మసీదు ఉందన్న విషయం శాస్త్రీయంగా తేలింది. సుప్రీం తీర్పు అసంపూర్తిగా ఉంది. ఈ విషయంలో ముస్లిం వర్గానికి అన్యాయం జరిగింది. దానంగా ఇచ్చే 5 ఎకరాల భూమి మాకు అక్కర్లేదు. ఆ ఐదెకరాల స్థలాన్ని కచ్చితంగా తిరస్కరించాల్సిందే. మా మీద సానుభూతి చూపాల్సిన అవసరం లేదు’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: సత్తా చాటిన ఎంఐఎం.. మహారాష్ట్ర, బీహార్‌లో పాగా

అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయస్థానం శనివారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. రామజన్మ న్యాస్‌కే వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని కోర్టు పేర్కొంది. దీనికి ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించాలని.. దీనికి కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.