యాప్నగరం

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ ప్రభావంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు.

Samayam Telugu 24 Aug 2020, 8:09 am
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. పశ్చిమ రాజస్థాన్ మధ్య భాగం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇది ఎత్తున వెళ్లే కొద్ది రైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉన్నదని ఇది క్రమంగా రాగల రెండు రోజుల్లో పశ్చిమ దిశగా రాజస్థాన్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు.
Samayam Telugu తెలంగాణలో వర్షాలు
telangana rains


ఇక ఉత్తర బంగాళాఖాతంలో దాని పరిసర ప్రాంతాల్లో సుమారుగా ఆగష్టు 24వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణలో నేడు, రేపు తేలికాపటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Read More: కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం
మరోవైపు అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కోస్తాంధ్ర, యానం, రాయలసీమలో కొన్నిచోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 25 నుంచి క్రమేణా వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.