యాప్నగరం

యురేనియం తవ్వకాలపై కేటీఆర్ స్పందన.. హీరో సాయి ధరమ్ తేజ్ థ్యాంక్స్

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన నల్లమల యురేనియం తవ్వకాల అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

Samayam Telugu 13 Sep 2019, 11:11 pm
ల్లమలలో యురేనియం తవ్వకాల అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. వ్యక్తిగతంగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ట్విటర్ వేదికగా శుక్రవారం (సెప్టెంబర్ 13) ఆయన హామీ ఇచ్చారు.
Samayam Telugu ktr


నల్లమలలో యురేనియం తవ్వకాలపై విపక్ష నేతలతో పాటు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్‌ నేత వీహెచ్‌ ఆధ్వర్యంలో టీపీసీసీ దీనిపై ఇప్పటికే పోరాట కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఈ విషయంపై చర్చించారు.

Also Read: యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆందోళన

జనసేనాని పవన్‌ కూడా యురేనియం తవ్వకాలపై పోరాటానికి సమాయత్తం అవుతున్నట్లు తెలిపారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, సెలబ్రిటీలు కూడా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హీరో సాయి ధరమ్ తేజ్.. మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్ చెబుతూ రీట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.