యాప్నగరం

హైదరాబాద్‌లో మూడు రోజులపాటు మద్యంషాపులు బంద్

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపుల్ని ఇవాళ సాయంత్రం నుంచి బంద్ చేయాలని అధికారులు ఆదేశలు ఇచ్చారు. మళ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు షాపులు తెరవకూడదన్నారు.

Samayam Telugu 29 Nov 2020, 8:03 am
గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవాల్టి నుంచి గ్రేటర్ ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్‌ 1 సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు బల్క్‌ మద్యం కొనుగోళ్లు, విక్రయాలపై ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆబ్కారీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.
Samayam Telugu మందుషాపులు బంద్
  • liquor shops closed


Read More: కేసీఆర్ సభ అట్టర్ ప్లాఫ్, మూసీ కాదు.. కేసీఆర్ నోరు క్లీన్ చేయాలి: బండి సంజయ్

ఒక వ్యక్తికి లేదా సమూహానికి బల్క్‌ మద్యం విక్రయాలు జరిపితే సంబంధిత మద్యం దుకాణాలపై ఎన్నికల కమిషన్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఓటర్లకు మద్యం ఎరగా వేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు. నిషేధం ఉన్న రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్‌లోకి మద్యం సరఫరా జరగకుండా సరిహద్దుల్లో పోలీసులు, ఆర్టీఏ అధికారులతో కలిసి ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తిరిగి పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 6 తర్వాత మళ్లీ నగరంలో మద్యం అమ్మకాలు చేసేందుకు అధికారులు అనుమతులు ఇవ్వనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.