యాప్నగరం

హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి వైమానిక సదస్సు

New Delhi: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. దేశ వైమానిక రంగంలో తెలంగాణ పాత్ర ఎంతో కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Samayam Telugu 8 Jan 2020, 3:08 pm
హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి వైమానిక సదస్సు జరగనుంది. మార్చిలో బేగంపేట విమానాశ్రయం వేదికగా జరిగే ‘వింగ్స్ ఇండియా-2020’ అంతర్జాతీయ ప్రదర్శన మరియు సదస్సుకు సంబంధించి గురువారం ఢిల్లీలో సన్నాహక సమావేశం జరగనుంది. అయితే, ఈ సమావేశానికి గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించాలని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. ఈ ఏడాది మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికగా 'వింగ్స్ ఇండియా-2020' కార్యక్రమం జరగనుంది.
Samayam Telugu Wings India 2020



Also Read: హైదరాబాద్‌లో వేలాది క్యాబ్ బుకింగ్‌ల నిలిపివేత

వింగ్స్ ఇండియా-2020 కార్యక్రమం దేశ వైమానిక రంగాన్ని అంతర్జాతీయంగా ప్రముఖంగా నిలబెడుతుందని హర్‌దీప్ సింగ్ అన్నారు. దేశ వైమానిక రంగంలో తెలంగాణ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వైమానిక సదస్సు కూడా నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎయిర్ లైన్స్, విమాన తయారీ సంస్థలు, కార్గో, స్పేస్ ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులు, పెట్టుబడిదారులు, వైమానిక రంగ నిపుణులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.

Also Read: KTRను అలా చూసి అవాక్కైన కానిస్టేబుల్!

ఈ సదస్సు ద్వారా దేశంలోని ఏరోస్పేస్ రంగంలో ఉన్న అవకాశాలను ప్రపంచ సంస్థలకు తెలిపే అవకాశం కలుగుతుందని కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం (జనవరి 9) ఢిల్లీ వేదికగా జరగనున్న సన్నాహక సమావేశంలో పౌరవిమానయాన శాఖతో పాటు కేంద్ర వ్యాపార వాణిజ్య శాఖ అధికారులు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరందరి ముందు మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు.

Also Read: ఏ మాత్రం సిగ్గున్నా పదవి నుంచి తప్పుకోండి: ఒవైసీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.