యాప్నగరం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. గచ్చిబౌలిలో విషాదం

Hyderabad నగరంలోని గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. ఉద్యోగం పోతుందనే బెంగతో ఓ యువతి ఉరేసుకొని తనువు చాలించింది. మరో ఉద్యోగం దొరకదేమోనని మనస్తాపానికి గురైంది.

Samayam Telugu 20 Nov 2019, 3:43 pm
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం కోల్పోతానని మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన పొగాకు రామలింగం కుమార్తె కుమారి హరిణి (24) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో నగరానికి వచ్చింది. రెండున్నరేళ్లుగా మాదాపూర్‌లోని గోల్డెన్ హిల్స్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది.
Samayam Telugu suicide
టెకీ ఆత్మహత్య


హరిణి పని చేస్తున్న సంస్థ ఒప్పందం ప్రకారం డిసెంబర్ నెలతో ఉద్యోగం గడువు ముగుస్తోంది. దీంతో ఆమెతో పాటు మరికొంత మందికి ఆ కంపెనీ నోటీసులు జారీ చేసింది. ఉద్యోగం పోతే తనకు మళ్లీ జాబ్ లభించదేమోనని హరిణి తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఉన్న ఉద్యోగం పోతే తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి వస్తుందని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

Must Read: భర్తకు గుండెపోటు.. ముందే చనిపోవాలని ఉరేసుకున్న భార్య

ఉద్యోగం కోల్పోతాతనని మనస్తాపానికి గురైన హరిణి ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలిలోని సైబర్ హీల్స్ వెంకటేశ్వర ఉమెన్ హాస్టల్‌లో తాను నివాసం ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం (నవంబర్ 19) రాత్రి 8.45 గంటల సమయంలో హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో హరిణి తన చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుంది.

పొగాకు హరిణి


హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. హరిణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.