యాప్నగరం

పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకుంటానని మహిళ హల్‌చల్‌

Choutuppal: చౌటుప్పల్‌లో టవర్‌ ఏర్పాటు కోసం పునాది తవ్వి నిర్మాణం మొదలు పెట్టారు. అయితే అక్కడ టవర్‌ నిర్మాణం చేపడితే తన ఇంటికి నష్టం జరుగుతుందని.. కూలిపోయే ప్రమాదం ఉందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

Samayam Telugu 13 Jun 2020, 3:35 pm
తన ఇంటి ముందు హై టెన్షన్‌ విద్యుత్‌ తీగలు ఏర్పాటు చేయకూడదని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ మహిళ ఆందోళనకు దిగింది. తన ఇంటికి సమీపం నుంచి ఏర్పాటు చేసే నిర్మాణాన్ని ఆపకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్ చేసింది. చౌటుప్పల్‌లో విద్యుత్‌ సబ్-స్టేషన్‌కు అదనపు విద్యుత్‌ జంక్షన్ కోసం రామన్నపేట నుంచి టవర్ ద్వారా విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రామన్నపేట నుంచి చౌటుప్పల్‌ వరకు టవర్ల నిర్మాణం చేపట్టారు.
Samayam Telugu పెట్రోల్ సీసాతో మహిళ
choutuppal


చౌటుప్పల్‌లో టవర్‌ ఏర్పాటు కోసం పునాది తవ్వి నిర్మాణం మొదలు పెట్టారు. అయితే అక్కడ టవర్‌ నిర్మాణం చేపడితే తన ఇంటికి నష్టం జరుగుతుందని.. కూలిపోయే ప్రమాదం ఉందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు ఆపకపోతే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.