యాప్నగరం

భూతవైద్యంపేరుతో బాలికకు మత్తుమందు ఇచ్చి.. అడ్డంగా దొరికేసిన దొంగబాబా

మెడిటేషన్ చేస్తనంటూ పిల్లలకు శిక్షణ ఇస్తానంటూ చెప్పుకుంటూ ఓ బాబా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడు నెలలుగా మత్తు మందు ఇచ్చి అమ్మాయిపై తన పైశాచికత్వం ప్రదర్శించాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో.. బాబా బండారం బయటపడింది.

Samayam Telugu 13 Oct 2020, 2:50 pm
భూతవైద్యం పేరుతో బాలికపై అత్యాచారం... చేసిన దొంగబాబను చితకబాదారు మహిళలు. చెప్పులు చీపుర్లు పట్టుకొని చితక్కొట్టుడు కొట్టారు. బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. దీంతో బాబా గుట్టు కాస్త రట్టు అయ్యింది. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికపై బెదిరింపులకు పాల్పడ్డాడు. బాలికకు మత్తుమందు ఇచ్చి ఇలా మూడునెలలుగా అఘాయిత్యానాకి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలో భూత వైద్యం పేరుతో మహిళలను మోసం చేస్తు అత్యాచార యత్నానికి పాల్పడుతున్నాడని మహిళలు ఆరోపిస్తున్నారు.
Samayam Telugu దొంగబాబాకు దేహశుద్ధి చేస్తున్న మహిళలు
Nizamabad fake baba


అయితే గతంలో కూడా బాబా ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడని పలువురు ఆరోపిస్తున్నారు. మహిళలతో కూడా అతడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు. మెడిటేషన్ పేరుతో పిల్లలకు ట్రీట్ మెంట్ అందిస్తామని చెప్పి తల్లిదండ్రుల్ని నమ్మిస్తున్నాడు ఈ దొంగబాబ. ఆ తర్వాత పిల్లలకు శిక్షణ పేరుతో వారిపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తున్నారు బాధితులు. అంతేకాకుండా వారి వద్దనుంచి వైద్యం పేరుతో వేలల్లో నగదు కూడా వసూలు చేస్తున్నాడని చెబుతున్నారు. మరోవైపు బాధిత బాలిక సైతం మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకుంది. తనకు మూడునెలలుగా మత్తు మందు ఇచ్చి నరకం చూపించాడని ఆవేదన వ్యక్తం చేసింది.

Read More: హైదరాబాద్ వరద నీటిలో బంగారు నగలు గల్లంతు

దీంతో బాధిత బాలిక కుటంబంతో పాటు పలువురు స్థానికులు మహిళలు బాబా ఉంటున్న ఆఫీసుపై దాడి చేశారు. అక్కడ ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కుర్చీలు, చీపుర్లు కర్రలతో దొంగబాబాకు తగిన దేహ శుద్ధి చేశారు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మహిళలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.