యాప్నగరం

‘మర్డర్’ సినిమాపై రగడ.. రామ్‌గోపాల్ వర్మకు ఘాటు హెచ్చరికలు

Miryalaguda Murder: నిజ జీవితంలో మారుతీరావు సాధుజీవి అని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి పాత్రతో మద్యం సేవిస్తున్నట్లు చూపించటం బాధాకరమని అన్నారు.

Samayam Telugu 28 Jul 2020, 8:15 pm
మిర్యాలగూడలో సంచలనం రేపిన ఘటన అయిన అమృత, మారుతీరావులపై ‘మర్డర్’ సినిమా తెరకెక్కించడం రామ్‌గోపాల్‌వర్మ శాడిజానికి నిదర్శనమని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జరిగిపోయిన ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు వారి సామాజిక వర్గాన్ని రోడ్డుకు ఈడ్చడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. మర్డర్ సినిమాపై మా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోతే రామ్ గోపాల్ వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Samayam Telugu మర్డర్ సినిమా ప్రచార చిత్రం, రామ్ గోపాల్ వర్మ
Ram gopal varma


నిజ జీవితంలో మారుతీరావు సాధుజీవి అని రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి పాత్రతో మద్యం సేవిస్తున్నట్లు చూపించటం బాధాకరమని అన్నారు. అమృత, తండ్రి మారుతీరావు ఇద్దరినీ విలన్లుగా చూపించడం వర్మ పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ఠ అని విమర్శించారు. ఒకరు ప్రేమించి తప్పు చేశారని, మరొకరు హత్య చేయించడం ద్వారా తప్పు చేశారంటూ ఇద్దరినీ విలన్లుగా సృష్టించారని తప్పుబట్టారు. మర్డర్ సినిమా ద్వారా రెండు కుటుంబాలను వర్మ బజారున పడేస్తున్నారని మండిపడ్డారు. తమ డిమాండ్‌కు వర్మ తలొగ్గకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని టంగుటూరి రామకృష్ణ హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.