యాప్నగరం

యశోద ఆస్పత్రి డాక్టర్ అనుమానాస్పద మృతి.. తీవ్ర జ్వరంతో బాధపడుతూ!

Hyderabad నగరంలోని పేట్ బషీరాబాద్‌లో ఓ యువ వైద్యుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ చికిత్స తీసుకున్న అతడు తెల్లారే సరికి విగతజీవిగా కనిపించడం అనుమానాలకు తావిస్తోంది.

Samayam Telugu 13 Mar 2020, 6:35 pm
శోద ఆస్పత్రిలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. పేట్ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గాయత్రి నగర్‌లో గోదావరి హోమ్స్‌లోని తన అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో శుక్రవారం (మార్చి 13) ఉదయం విగతజీవిగా కనిపించారు. మృతుడు సుభాష్‌ (32) స్వస్థలం మంచిర్యాల జిల్లా తంగూర్ గ్రామంగా పోలీసులు వెల్లడించారు. 2017లో హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్న ఆయన.. స్థానికంగా నివాసం ఉంటూ యశోద ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.
Samayam Telugu subhash


తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సుభాష్ గురువారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో ఇంటికి తిరిగి వచ్చేశారు. శుక్రవారం ఉదయం తన గదిలో విగతజీవిగా పడి ఉన్నాడు. వివరాల కోసం ప్రయత్నించగా కుటుంబ సభ్యులు, బంధువులు నిరాకరించడం అనుమానాలకు తావిస్తోంది.

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యభర్తలు కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సుభాష్‌ మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: రేవంత్ రెడ్డి తీస్మార్‌ఖానా, సీఎం ఎలా అవుతాడు.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.