యాప్నగరం

రోడ్లపై ఉమ్మితే అంతే.. భువనగిరిలో యువకుడి అరెస్ట్

Bhongir: కరోనా నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టింది. రోడ్లపై ఉమ్మి వేయొద్దని, మాస్కు ధరించకుండా రోడ్లపైకి రావొద్దని ఆదేశించింది. భువనగిరిలో రోడ్దుపై ఉమ్మినందుకు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు.

Samayam Telugu 16 Apr 2020, 9:20 am
రోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఆది నుంచి కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తు్న్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరిన్ని కఠిన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖానికి మాస్కు లేకుండా ఆరుబయటకి వచ్చినా, రోడ్ల మీద ఉమ్మినా.. కఠిన చర్యలు తీసుకుంటామని, అరెస్టు చేయడానికి కూడా వెనుకాడమని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయినప్పటికీ కొంత మంది ఈ నిబంధనలను పెడచెవిన పెట్టి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
Samayam Telugu spit


రోడ్డు మీద ఉమ్మి వేసినందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఇది రెండో కేసు కావడం గమనార్హం. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఓ యువకుడిని ఈవిధంగా అరెస్టు చేశారు. రాయగిరికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు బుధవారం (ఏప్రిల్ 15) భువనగిరి పట్టణంలో ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు డబ్బులు డ్రా చేసుకోవడం కోసం వచ్చాడు. ఆ సమయంలో రోడ్డు మీద ఉమ్మి వేశాడు.

అక్కడే ఉన్న పోలీసులు యువకుడు బహిరంగ ప్రదేశంలో ఉమ్మి వేయడం గమనించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Also Read: హైదరాబాద్‌లో 15 వేల పెళ్లిళ్లకు బ్రేక్..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.