యాప్నగరం

MLC: మరోమారు ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత.. ఏకగ్రీవం.!

కేసీఆర్ కుమార్తె కవిత మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Samayam Telugu 24 Nov 2021, 3:16 pm
కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మరోమారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన కవిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్‌ తిరస్కరణకు గురవడంతో కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం శ్రీనివాస్ దాఖలు చేసిన పత్రాలు సరిగ్గా లేవని అధికారులు తిరస్కరించినట్లు తెలుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kavitha kalvakuntla


అదే విషయం అభ్యర్థి శ్రీనివాస్‌కి కూడా అధికారులు తెలియజేశారు. బుధవారం ఉదయం నామినేషన్ పత్రాల స్క్రూటినీ సమయంలో గందరగోళం తలెత్తింది. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ స్థానిక సంస్థల ఓటర్లు ఫిర్యాదు చేయడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. అలాంటిదేమీ లేదని శ్రీనివాస్ కొట్టిపారేశారు. అయినా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ పత్రాలు జుడీషియల్ ప్రకారం ఇవ్వలేదని.. అందుకే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సీఎం కేసీఆర్ కూతురు కవిత ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నిజామాబాద్‌లో ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికైందని టీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ నివాసంలో మంత్రి ప్రశాంత్ రెడ్డికి మిఠాయి తినిపించి హర్షం వ్యక్తం చేశారు. బాణసంచా కాల్చి వేడకలు జరిపారు. కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవమైనట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే భారీ ఎత్తున విజయోత్సవాలకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.