యాప్నగరం

బోర్నపల్లి బ్రిడ్జి కల సాకారం.. పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత

Jagtial: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల నియోజకవర్గంలో గల బోర్నపల్లి బ్రిడ్జిని పరిశీలించారు. ఎమ్మెల్యే సంజయ్, స్థానిక గ్రామాల ప్రజలతో కలిసి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా‌ పరిశీలించారు.

Samayam Telugu 17 Dec 2020, 7:30 pm
బోర్నపల్లి వంతెన.. జగిత్యాల ప్రజల ఏళ్ల నాటి కల.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషితో ప్రజల కల సాకారమైంది. 2014 ఎన్నికల సమయంలో వంతెన, రెండు లేన్ల రహదారి నిర్మిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత.. నేడు అదే వంతేనను ప్రజలతో కలిసి పరిశీలించారు. బ్రిడ్జి, రోడ్డు లేక, ఏళ్లుగా తాము పడ్డ బాధలను ఎమ్మెల్సీ కవితతో పంచుకున్నారు స్థానిక ప్రజలు.
Samayam Telugu బ్రిడ్జిపై కవిత
kalvakuntla kavitha visits bornapalli bridge


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల నియోజకవర్గంలో గల బోర్నపల్లి బ్రిడ్జిని పరిశీలించారు. ఎమ్మెల్యే సంజయ్, స్థానిక గ్రామాల ప్రజలతో కలిసి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా‌ పరిశీలించారు. ఇచ్చిన మాటను నిలుపుకొని ఇక్కడి ప్రజలకు రోడ్డు, వంతెన సౌకర్యాన్ని కల్పించిన ఎమ్మెల్సీ కవితకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

బోర్నపల్లి బ్రిడ్జి నేపథ్యం
జగిత్యాల నియోజకవర్గం రాయికల్‌ మండలం బోర్నపల్లి - నిర్మల్‌ జిల్లా చిన్నబెల్లాల, పెద్ద బెల్లాల గ్రామాల మధ్య గోదావరి ప్రవహిస్తుంది. నదిపై వంతెన నిర్మించాలని మండల ప్రజలు చాలా ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. కానీ, అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2014లో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుంట్ల కవిత రాయికల్‌ మండలంలోని అటవీ గ్రామాలకు వచ్చారు. గోదావరిపై వంతెన నిర్మించాలని పలు గ్రామాల ప్రజలు వేడుకున్నారు. సమస్యను గుర్తించిన ఆమె, వంతెన నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంతెనతోపాటు బోర్నపల్లి నుంచి రాయికల్‌ దాకా 18కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారి నిర్మాణానికి 70 కోట్ల రాష్ట్ర సర్కారు నిధులు మంజూరు చేయించారు. పనులు మొదలై, కొద్దిరోజుల క్రితమే వంతెన పూర్తయింది. వంతెన రాకతో సమీప గ్రామాల ప్రజల వెతలు తీరడంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల మధ్య దూర భారం తగ్గింది. రవాణా సౌకర్యం మెరుగుపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.